ఇద్దరు భామ‌ల‌తో శ‌ర్వానంద్ రొమాన్స్ హ్యాట్రిక్!

యంగ్ హీరో శ‌ర్వానంద్ స‌క్సెస్ కోసం పోరాటం చేస్తున్నాడు. కొంత కాలంగా శ‌ర్వాకి విజ‌యాలు చెంత చేర కపోవ‌డంతో క‌సిగా ప‌ని చేస్తున్నాడు.;

Update: 2025-06-19 21:30 GMT
ఇద్దరు భామ‌ల‌తో శ‌ర్వానంద్ రొమాన్స్ హ్యాట్రిక్!

యంగ్ హీరో శ‌ర్వానంద్ స‌క్సెస్ కోసం పోరాటం చేస్తున్నాడు. కొంత కాలంగా శ‌ర్వాకి విజ‌యాలు చెంత చేర కపోవ‌డంతో క‌సిగా ప‌ని చేస్తున్నాడు. ఒకేసారి రెండు..మూడు సినిమాలు సెట్స్ లో పెట్టాడు. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న 35, 36, 37 చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. 35వ చిత్రం `నారీ నారీ న‌డుమ మురారీ`. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్ర‌మిది. ఇదొక ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ.

వినోదానికి పెద్ద పీట వేసారు. శర్వానంద్‌ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో శర్వాకి జోడీగా ముగ్గురు భామ‌లు న‌టిస్తున్నారు. సాక్షి వైద్య, సంయుక్త మీన‌న్ తో పాటు మ‌రో భామ న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. అలాగే శ‌ర్వానంద్ 37వ చిత్రం `భోగి`. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ‌రో హీరోయిన్ కు ఛాన్స్ ఉంద‌ని స‌మా చారం.

ఆ పాత్ర కోసం భామ‌ను తీసుకోవాల‌నుకుంటున్నారుట‌. 1960ల నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథ ఆధారంగా రూపొందుతోంది. ఇదొక పీరియడ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలు అప్ డేట్స్ లో క‌నిపిస్తున్నాయి. 36వ చిత్రం కూడా ప్ర‌క‌టించారు. కానీ ఇంకా ఈ సినిమా ప‌ట్టాలెక్కిన‌ట్లు లేదు. ఇందులో కూడా క‌థానుగుణంగా ముగ్గురు హీరోయిన్లు ఉంటార‌ని స‌మాచారం.

ఇంత వ‌ర‌కూ శ‌ర్వానంద్ ఒకేసారి ముగ్గురు హీరోయిన్ల‌తో క‌లిసి న‌టించడం జ‌ర‌గ‌లేదు. ఆ రకంగా ఇదే తొలి అనుభ‌వం. గ‌తంలో ఇద్ద‌రు భామ‌ల ముద్దుల ప్రియుడిగా న‌టించాడు కానీ ముగ్గురు భామ‌ల ముద్దుల ప్రియుడు అవ్వ‌డం ఇదే తొలిసారి. మ‌రి శ‌ర్వా ఆన్ సెట్స్ అనుభ‌వాలు ఎలా ఉన్నాయ‌న్న‌ది త్వ‌ర‌లోనే బ‌య‌ట ప‌డుతుంది.

Tags:    

Similar News