• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగు సినిమా...

తెలుగు సినిమా సంప్ర‌దాయాన్ని త‌ప్పించిన శంక‌ర్!

| తెలుగు సినిమా అంటే అందులో క‌చ్చితంగా ఐంటం పాట ఉండాల్సిందే. దీన్ని ద‌ర్శ‌కులు, హీరోలు, అభిమానులు ఓ కండీష‌న్ గా భావిస్తుంటారు.

By - Tupaki Desk
Update: 2024-12-20 19:30 GMT

తెలుగు సినిమా అంటే అందులో క‌చ్చితంగా ఐంటం పాట ఉండాల్సిందే. దీన్ని ద‌ర్శ‌కులు, హీరోలు, అభిమానులు ఓ కండీష‌న్ గా భావిస్తుంటారు. ఎంతో కాలంగా వ‌స్తోన్న ఆన‌వాయితీ ఇది. సినిమా ఎలా ఉన్నా స‌రే? స‌న్నివేశం డిమాండ్ చేసినా? చేయ‌క‌పోయినా స‌రే రెండున్న‌ర గంట‌ల సినిమాలో ఒక్క ఐటం పాట మాత్రం త‌ప్ప‌క ఉండాల్సిందే. ఈ సంప్ర‌దాయాన్ని తెలుగులో ఏ డైరెక్ట‌ర్ మిస్ అవ్వ‌రు. ఒక‌వేళ మిస్ అయితే? అభిమానుల నుంచి విమ‌ర్శ‌ల‌కు సిద్దంగా ఉండాల్సి ఉంటుంది.

ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ తో శంక‌ర్ `గేమ్ ఛేంజ‌ర్` సినిమా చేస్తున్నారు. మ‌రి అందులో ఐటం పాట ఉందా? లేదా? అన్న‌ది ఇప్పుడు మెగా అభిమానుల్లో వాడి వేడి చ‌ర్చ‌. ఆ వివ‌రాల్లోకి వెళ్తే? సాధార‌ణంగా శంక‌ర్ సినిమాల్లో ఐటం పాట‌లు ఉండ‌వు. ఐటం భామ ఎక్క‌డా క‌నిపించ‌దు. కానీ సినిమాలో భారీత‌నం క‌నిపిస్తుంది. పాట‌ల కోసం కోట్ల రూపాయ‌ల సెట్లు వేయిస్తారు. ఆ పాట‌ల్లో అద్భుత‌మైన్ గ్రాపిక్స్ ఉంటాయి. పాట డిమాండ్ చేసిందంటే? ప్ర‌పంచంలో ఏ ప్రాంతానికైనా వెళ్లి అక్క‌డ పాట చిత్రీక‌రించి రావ‌డం అన్న‌ది శంక‌ర్ స్టైల్.

అంతేగానీ ప్ర‌త్యేకంగా ఐటం పాట‌లు మాత్రం ఆయ‌న సినిమాల్లో ఎక్క‌డా క‌నిపించ‌వు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతో మంది స్టార్ హీరోల‌తో ప‌ని చేసారు. కానీ ఏ సినిమాలోనూ ఐటం పాట లేదు. అయితే ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న డైరెక్ట్ చేసింది కేవ‌లం కోలీవుడ్ సినిమాలే. తెలుగు సినిమాలు డైరెక్ట్ చేయ‌లేదు. మ‌రి తెలుగు ఆడియ‌న్స్ ని దృష్టిలో పెట్టుకుని ఐటం పాట ట‌చ్ ఏమైనా ఇస్తున్నారా? అన్న‌ది చూడాలి.

కానీ `గేమ్ ఛేంజ‌ర్` లో మాత్రం అలాంటి పాట ఉన్న‌ట్లు ఇంత వ‌ర‌కూ ఎలాంటి స‌మాచారం లేదు. ఐటం పాట పెడితే అందుకోసం ప్ర‌త్యేకంగా హాట్ బ్యూటీని రంగంలోకి దించుతారు. అలాంటి హ‌డావుడి `గేమ్ ఛేంజ‌ర్` విష‌యంలో ఎక్క‌డా చోటు చేసుకోలేదు. ఇప్ప‌టికే మెగా అభిమానుల్లో `పుష్ప‌-2`లో కిసిక్ త‌ర‌హా ఐటం సాంగ్ మ‌న హీరో సినిమాలో లేదంట‌! అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఉంటే బాగుండ‌ని కొంత మంది అంటుంటే, శంక‌ర్ సినిమాలో అందుకు ఛాన్సే లేద‌ని ఫిక్సైపోయిన వాళ్లు మరికొంత మంది.

Tags:    
  • Shankar 
  • Gamechangermovie 
  • Ramcharan 
  • Itemsongs 
  • Pushpa2 
  • Gamechangersongs 
  • Filmindustry 
  • Directorshankar 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS