శంకర్ రేసులో ఉన్నది ఎవరు..?
ఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా పాపులారిటీ తెచ్చుకున్న శంకర్ ఈమధ్య అసలేమాత్రం ఫాంలో లేరని తెలిసిందే.;
ఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా పాపులారిటీ తెచ్చుకున్న శంకర్ ఈమధ్య అసలేమాత్రం ఫాంలో లేరని తెలిసిందే. ఆయన ఫస్ట్ టైం తెలుగు స్ట్రైట్ సినిమాగా చరణ్ తో గేమ్ ఛేంజర్ చేశారు. ఆ సినిమాపై ఉన్న అంచనాలకు అది డిజాస్టర్ అయ్యింది. ఐతే గేమ్ ఛేంజర్ రిజల్ట్ చూసిన శంకర్ కాస్త గ్యాప్ తీసుకుని నెక్స్ట్ సినిమాతో భారీ ప్లానింగ్ తో వస్తున్నారు. శంకర్ నెక్స్ట్ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా కొన్నాళ్ల నుంచి డిస్కషన్ లో ఉన్న వేల్పారి చేయబోతున్నారట. దీనికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది.
శంకర్ తో సినిమా నిర్మాతలు క్యూ కట్టేవారు..
ఐతే ఒకప్పుడు శంకర్ తో సినిమా అంటే నిర్మాతలు క్యూ కట్టేవారు.. హీరోలైతే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అఫ్కోర్స్ నిర్మాతలు ఆయన స్టామినా గురించి తెలిసి తీస్తామని వస్తున్నా కూడా హీరోలు డేర్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. రజనీకాంత్, కమల్ హాసన్ ఆల్రెడీ శంకర్ తో చేశారు కాబట్టి అయినా ఇప్పుడు వారి వారి సినిమాల కమిట్మెంట్ తో ఉన్నారు కాబట్టి వారు శంకర్ తో తీసే ఛాన్స్ లేదు.
నెక్స్ట్ విజయ్ ఎలాగు సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. అజిత్, విక్రం లాంటి వారితో శంకర్ చేస్తాడా అన్న చర్చ నడుస్తుంది. ఐతే శంకర్ దృష్టిలో శివ కార్తికేయన్ పడినట్టు తెలుస్తుంది. వీజే నుంచి కోలీవుడ్ స్టార్ గా శివ కార్తికేయన్ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. శివ కార్తికేయన్ తో అయితే ప్రాజెక్ట్ అదిరిపోతుందని భావిస్తున్నారట. ఐతే శంకర్ లాంటి డైరెక్టర్ తో సినిమా అంటే శివ కార్తికేయన్ నో చెప్పే ఛాన్స్ లేదు.
శివ కార్తికేయన్ తో పాటు సూర్య, ధనుష్ ..
ఐతే అతనితో పాటు శంకర్ సూర్య, ధనుష్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. సో శంకర్ నెక్స్ట్ సినిమా ఎవరు చేసినా సరే ఆ స్టార్ ఫ్యాన్ బేస్, క్రేజ్ తో పాటు ఒకప్పటి శంకర్ డైరెక్షన్ టాలెంట్ కూడా చూస్తారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ స్టేట్మెంట్ రాబోతుందట. ఆ టైం లోనే శంకర్ తో చేసే హీరో మిగతా కాస్టింగ్ ఫైనల్ అవుతుందని తెలుస్తుంది. మరి శంకర్ ఈసారి ఎవరితో సినిమాకు రెడీ అవుతున్నారు అన్నది త్వరలో తెలుస్తుంది.
తమిళ్ తో పాటు తెలుగు మిగతా సౌత్ ఆడియన్స్ కి పరిచయం ఉన్న స్టార్స్ అయితే బిజినెస్ తో పాటు సినిమా కూడా ఎక్కువ రీచ్ ఉంటుందని శంకర్ ఇలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై జరుగుతున్న ఈ డిస్కషన్ కోలీవుడ్ ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ చేస్తుంది.