శంబాల దూకుడు తగ్గలేదు..!

ఆది సాయి కుమార్ హీరోగా యుగంధర్ ముని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా శంబాల. ఈ సినిమాపై మొదటి నుంచి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఏర్పడింది.;

Update: 2026-01-02 09:50 GMT

ఆది సాయి కుమార్ హీరోగా యుగంధర్ ముని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా శంబాల. ఈ సినిమాపై మొదటి నుంచి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఏర్పడింది. సినిమా టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ చేయడంతో పాటు డిసెంబర్ 25 క్రిస్మస్ కి రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కొన్నాళ్లుగా ఆది సాయి కుమార్ సినిమాలు ఆడియన్స్ ని అలరించలేకపోతున్నాయి. ఈ క్రమంలో శంబాల సినిమా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడమే కాదు మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది.

బుక్ మై షోలో శంబాల సినిమాకు..

ఐతే శంబాల సినిమా రిలీజై వారం అవుతుంది. కొత్తగా న్యూ ఇయర్ కి కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో సైక్ సిద్ధార్థ్, వనవీర ఉన్నాయి. ఐతే ఈ రెండు సినిమాలకు అంత గొప్ప టాక్ రాలేదు. అంతేకాదు వారం ముందు రిలీజైన శంబాలకి న్యూ ఇయర్ రోజు మంచి ఫుట్ ఫాల్స్ పడ్డాయి. బుక్ మై షోలో శంబాల సినిమాకు న్యూ ఇయర్ రోజు 45 వేల టికెట్స్ బుకింగ్ అయ్యాయి. ఆ తర్వాత రోషన్ మేక ఛాంపియన్ సినిమా 18 వేల టికెట్స్ బుకింగ్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది.

ఐతే ఎప్పుడో డిసెంబర్ రెండో వారం రిలీజైన అఖండ 2 సినిమాకు ఇంకా బుక్ మైక్ షో బుకింగ్స్ బాగున్నాయి. అఖండ 2 సినిమాకు న్యూ ఇయర్ రోజు 16 వేల దాకా టికెట్స్ బుక్ అయ్యాయి. అఖండ 2 సినిమా డిసెంబర్ 12న రిలీజైంది. సినిమా రిలీజై 18 రోజులు అవుతున్నా 3 వారాల తర్వాత కూడా సినిమాకు మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి.

కంటెంట్ ఉన్న సినిమాలకు ఆడియన్స్..

న్యూ ఇయర్ బాక్సాఫీస్ రేసులో వారం ముందు రిలీజైన శంబాల దూకుడు చూపిస్తుంది. ఈ సినిమా సక్సెస్ తో ఆది సాయి కుమార్ సూపర్ హ్యాపీగా ఉన్నాడు. శంబాల సినిమా విషయంలో ఆది మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఆ నమ్మకమే నిజం చేస్తూ ప్రేక్షకుల నుంచి ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఆది హిట్ తో సాయి కుమార్ కూడా మంచి జోష్ లో ఉన్నారు.

కంటెంట్ ఉన్న సినిమాలకు ఆడియన్స్ ఎప్పుడు తమ ఆమోదాన్ని తెలుపుతారు. ఆది సాయి కుమార్ శంబాల సినిమా సైన్స్ తో పాటు ఫిక్షనల్ కూడా యాడ్ అవడంతో సినిమాపై హ్యూజ్ బజ్ ఏర్పడింది. ఐతే సినిమా కూడా అదే రేంజ్ లో ఉండటంతో ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయ్యింది. న్యూ ఇయర్ కి రిలీజైన సినిమాల పైన కూడా శంబాల డామినేషన్ చూపిస్తుంది. చూస్తుంటే ఈ వారం కూడా శంబాల సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటేలా ఉంది. ఆది సాయి కుమార్ ఈ సక్సెస్ తో కెరీర్ లో ఎనర్జీ నింపుకునే ఛాన్స్ ఉంటుంది. శంబాల తర్వాత నెక్స్ట్ కూడా ఆయన నుంచి ఇలాంటి సినిమాలే ఆశిస్తున్నారు ఆడియన్స్.

Tags:    

Similar News