మిస్టిక్ థ్రిల్లర్ 'శంబాల'.. ఆది కెరీర్ లోనే ది టాప్..
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ రీసెంట్ గా శంబాల మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ రీసెంట్ గా శంబాల మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మిస్టిక్ థ్రిల్లర్ గా యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఆ సినిమా.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన మంచి అంచనాల మధ్య గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చింది. వాటిని అందుకుని దూసుకుపోతోంది.
రిలీజ్ కు ముందు ప్రీమియర్ షోస్ పడగా.. అప్పుడే పాజిటివ్ మౌత్ టాక్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత రెండు తెలుగు స్టేట్స్ లో కూడా ఫుల్ గా స్ప్రెడ్ అయింది. అయితే మూవీ చూసిన వాళ్లంతా సినిమా బాగుందని సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు. మూవీ కోసం ఆది సాయి కుమార్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని రివ్యూలో చెబుతున్నారు.
అయితే ఇప్పుడు శంబాల మూవీ.. ఆది సాయి కుమార్ కెరీర్‌లోనే ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న సినిమా.. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.3.3 కోట్లు సాధించింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ శంబాల అంటూ రాసుకొచ్చారు.
అదే సమయంలో పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుండడంతో శంబాలకు స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఫస్ట్ డే అనేక చోట్ల హౌస్ ఫుల్ అవ్వడంతో.. సినిమా బాగుందని రివ్యూస్ రావడంతో.. రెండు స్టేట్స్ లో థియేటర్స్ కౌంట్ పెరిగింది. దీంతో సినీ ప్రియులు.. శంబాల చూసేందుకు థియేటర్స్ కు ఇప్పుడు తరలివెళ్తున్నట్లు కనిపిస్తున్నారు.
ముఖ్యంగా క్రిస్మస్ సీజన్.. శంబాల చిత్రానికి బాగా కలిసొచ్చింది. వరుస సెలవులు రావడం సినిమాకు ఇంకా ప్లస్ గా మారింది. అయితే శంబాల ఓపెనింగ్స్ తో పాటు స్క్రీన్ల పెరుగుదల చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. రానున్న రోజుల్లో శంబాల కచ్చితంగా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇక శంబాల విషయానికొస్తే.. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమాలో ఆది సాయి కుమార్ తో పాటు అర్చన అయ్యర్, స్వస్తిక విజయ్ కీలక పాత్రలు పోషించారు. రవి వర్మ, మధునందన్, హర్షవర్ధన్, శైలజ ప్రియ, శిజు, అన్నపూర్ణమ్మ, మీసాల లక్ష్మణ్, ఇంద్రనీల్, ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్న భీమోజు సంయుక్తంగా నిర్మించారు. ప్రవీణ్ కె బంగారి విజువల్స్ అందించారు. శ్రావణ్ కటికనేని ఎడిటర్ గా, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మరి ఫుల్ రన్ లో ఆది సాయికుమార్ శంబాల మూవీ ఎంతటి వసూళ్లు సాధిస్తుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.