• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైల‌ర్ టాక్: కంత్రీ...

ట్రైల‌ర్ టాక్: కంత్రీ 'సైతాన్' వికృత ఆట‌

| హార‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో చంద్ర‌ముఖి, కాంచ‌న ఫ్రాంఛైజీలు గొప్ప విజ‌య‌వంత‌మైన ఫ్రాంఛైజీలుగా ప్ర‌జ‌ల‌కు తెలుసు

By - Tupaki Desk
Update: 2024-02-22 11:56 GMT

హార‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో చంద్ర‌ముఖి, కాంచ‌న ఫ్రాంఛైజీలు గొప్ప విజ‌య‌వంత‌మైన ఫ్రాంఛైజీలుగా ప్ర‌జ‌ల‌కు తెలుసు. అయితే ఇవ‌న్నీ దెయ్యాలు ఆత్మ‌ల చుట్టూ తిరిగే క‌థ‌లు. ఇవే అంశాల‌ను ఎంపిక చేసుకున్నా కానీ వాట‌న్నిటి కంటే భిన్నంగా ఒక థ్రిల్ల‌ర్ స్టోరీని ఎలా డ్రైవ్ చేయాలి? అనేదానికి ఇదిగో ఇప్పుడు వ‌స్తున్న సైతాన్ ఒక ఎగ్జాంపుల్. తాజాగా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'సైతాన్' ట్రైలర్ విడుద‌లైంది. ట్రైల‌ర్ ఇన్ స్టంట్ హిట్. అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ లాంటి టాప్ స్టార్స్ నటించిన ఈ చిత్రం మంచి చెడుల మధ్య జ‌రిగే పోరాటం.. చెడుపై మంచి గెలుపు వంటి అంశాల‌తో తెర‌కెక్కింది. ర‌క‌ర‌కాల మ‌లుపుల‌తో సాగుతున్న ఈ థ్రిల్ల‌ర్ మూవీలో మ్యాడీ పాత్ర చాలా ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకుంటోంది.

మాధ‌వ‌న్ ఒక సైతాన్. అత‌డు దేవ‌గ‌న్ కుమార్తెను వ‌శ‌ప‌రుచుకుంటాడు. యువ‌తిపై వ‌శీక‌ర‌ణ మంత్రాన్ని ప్ర‌యోగిస్తాడు. అనూహ్యంగా ఆ యువ‌తి ఇంట్లోనే అత‌డు సాగించే భ‌యాన‌క‌మైన ఆట ఏమిట‌న్న‌ది ఈ ట్రైల‌ర్ లో చూడొచ్చు. ట్రైల‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తోంది. కుమార్తె వ‌ల్ల గంద‌ర‌గోళంలో ప‌డే అన్ హ్యాపీ క‌పుల్ గా దేవగన్-జ్యోతిక నటించారు. మాధవన్ పాత్ర ఒక మంత్ర‌గాడి కుయుక్తుల‌తో సాగుతుంది. అత‌డు చూడ‌టానికి అధునాత‌నంగా క‌నిపించినా కానీ వ‌శీక‌ర‌ణ విద్య‌లో ఆరితేరిన వాడిగా క‌నిపిస్తున్నాడు.

అత‌డు కుమార్తెను అడ్డుపెట్టుకుని దంప‌తుల‌ను సాధించాల‌నుకున్నాడా? వారి వ‌ల్ల జ‌రిగిన పాపం ఏమిటి? అన్న‌ది ఎక్క‌డా రివీల్ కాలేదు. సైతాన్ ఉద్దేశ్యాలు రహస్యం..అతడు ఆ టీనేజీ యువ‌తిని ఒక వికృత‌మైన‌ ఆటలో పావుగా ఉపయోగించుకున్నాడు. ఆద‌ర్శ‌ దంప‌తుల జీవితాల‌ను తారుమారు చేస్తాడు. వారు క్ష‌ణ‌క్ష‌ణం ఉనికి కోసం భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌స్తుంది. ట్రైలర్ ఆద్యంతం సీట్ అంచుపైకి జారిపోయేంత‌టి థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ఆక‌ట్టుకుంది. వీక్షకులు సైతాన్ అంతిమ లక్ష్యం ఏమిటో ముందే ఊహించగలరు. గంభీరమైన వాతావరణం.. వెంటాడే సంగీతం.. దేవగన్ -జ్యోతిక‌లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం.. విలాసంగా న‌వ్వుతూ మాధ‌వ‌న్ ఆడే ఆట ఇదంతా ర‌క్తి క‌ట్టిస్తుంది. ట్రైల‌ర్ తోనే ఈ సినిమా ఎంత గ్రిప్పింగ్ గా తెర‌కెక్కిందో అర్థ‌మ‌వుతోంది.

ఈ సినిమా ఒక రీమేక్ చిత్రం. గుజరాతీ చిత్రం 'వాష్' ఆధారంగా రూపొందింది. 'క్వీన్' ఫేం వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. చిత్రం 8 మార్చి 2024న అంత‌ర్జాతీయ‌ మ‌హిళా దినోత్స‌వ కానుక‌గా విడుద‌ల‌వుతోంది.

Full View
Tags:    
  • Shaitaantrailer 
  • Ajaydevgn 
  • Rmadhavan 
  • Jyotika 
  • Jiostudios 
  • Devgnfilms 
  • Panoramastudios 
  • Shaitaanmovie 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS