పాక్ క్రికెటర్‌ను భయపెడుతున్న'ధురంధర్'!
ఒకానొక టైమ్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఫేవరేట్‌గా నిలిచిన షాహీద్ అఫ్రీదీ ధురంధర్` పేరు చెబితే భయంతో వణికిపోతున్నాడు.;
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మూవీ `ధురంధర్ 2`. ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డుల్ను తిరగరాస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా ర్యాంపేజ్ చేస్తూ కలెక్షన్‌ల సునామీని సృష్టిస్తూ సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే రికార్డుల వేట మొదలు పెట్టిన `ధురంధర్ 2` ఇప్పటి వరకు రూ.830 కోట్ల వరకు వసూళ్లని సాధించింది. ఈ స్పీడు చూస్తుంటే ఈ వీకెండ్‌కి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన `ధురంధర్ 2`పై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దక్షిణాది స్టార్స్ ఇప్పటికే ఈ మూవీపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతూ టీమ్‌ని అభినందించిన విషయం తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ జాబితాలో చేరి `ధురంధర్ 2` సినిమాపై ఆసక్తికరంగా స్పందించారు. బాక్సాఫీస్ కా బాప్ అని ప్రశంసించడమే కాకుండా అద్భుతం అంటూ కొనియాడారు. దర్శకుడు ఆదిత్యధర్‌ని ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో రజనీ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే `ధురంధర్2` భయం పాకిస్థాన్‌ని వెంటాడుతోంది. అంతే కాకుండా ఈ సినిమా పేరు చెబితేనే పాక్ క్రికెటర్స్ కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఒకానొక టైమ్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఫేవరేట్‌గా నిలిచిన షాహీద్ అఫ్రీదీ ధురంధర్` పేరు చెబితే భయంతో వణికిపోతున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా రిలీజ్ తరువాత నుంచి పాక్‌లో ఎవరితో మాట్లాడాలన్నా భయపడుతున్నాడట. ఇండియన్ ఏజెంట్ అయి ఉంటారని, అందుకే ఆచితూచి మాట్లాడాలని భావిస్తున్నాడట.
పాక్‌లో ఓ మీడియాతో మాట్లాడుతూ షాహీద్ అఫ్రీదీ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. `ధురంధర్` సినిమా తరువాత పాకిస్థాన్‌లో ఇక ఎవరినీ నమ్మలేము. నేను ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ఎందుకంటే వారు బహుషా భారతీయ ఏజెంట్లు అయి ఉండవచ్చని నాకు అనిపిస్తుంది. అంతే కాకుండా రోడ్డు పక్కన బిచ్చగాళ్ల నుండి మొదలుకొని ప్రతి ఒక్కరినీ వారు భారతీయ ఏజెంట్లు అవునా కాదా? అని నిర్థారించుకోవడానికి ప్రభుత్వం ఒక్కొక్కరిగా విచారించాలని నేను భావిస్తున్నాను` అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతూ నాక్ క్రికెటర్ అఫ్రీదిలో `ధురంధర్` కలిగించిన భయాన్ని తెలియజేస్తోంది.