రజినీకాంత్-కమల్ హాసన్ జర్నీ.. బిట్ రోల్ నుంచి ఈక్వల్ స్టార్స్ వరకూ!
తమిళ చిత్రసీమలోనే కాదు, మొత్తం ఇండియన్ సినిమా హిస్టరీలోనే రజినీకాంత్, కమల్ హాసన్ ల అనుబంధం అత్యంత అరుదైంది, పవిత్రమైంది.
తమిళ చిత్రసీమలోనే కాదు, మొత్తం ఇండియన్ సినిమా హిస్టరీలోనే రజినీకాంత్, కమల్ హాసన్ ల అనుబంధం అత్యంత అరుదైంది, పవిత్రమైంది. కెరీర్ ఆరంభంలో చిన్న పాత్రలతో మొదలై, కేవలం రెండేళ్లలోనే ఇద్దరూ సమాన స్థాయి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరి దారిలో వారు సంచలనాలు సృష్టించిన ఈ ఇద్దరు లెజెండ్స్... ఏకంగా 40 ఏళ్ల నాటి తమ కలని నిజం చేస్తూ ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్‌తో చేతులు కలిపారు. ఈ చారిత్రాత్మక కాంబో మూవీ టైటిల్ 'ధర్మన్' ను ఈరోజు జూన్ 24 న అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..ఆ వివరాలు ఇలా వున్నాయి..
ఏవీఎం వేప చెట్టు కింద మొదలైన కల:
'ధర్మన్' టైటిల్ మరియు రజినీకాంత్ డాక్టర్ గెటప్ యాక్షన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన సందర్భంగా కమల్ హాసన్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. "ఒకప్పుడు ఏవీఎం స్టూడియోస్‌లోని వేప చెట్టు కింద కూర్చుని భవిష్యత్తు గురించి కలలు కన్న ఆ ఇద్దరు కుర్రాళ్లు.. ఈ రోజు ఈ స్థాయిలో ఇండస్ట్రీని శాసిస్తామని అస్సలు అనుకోలేదు" అంటూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. రజినీకాంత్ మొదట్లో చిన్న బిట్ రోల్‌తో కెరీర్ స్టార్ట్ చేసినా, కేవలం రెండేళ్లలోనే ఇద్దరం ఈక్వల్ స్టార్స్ అయ్యామని కమల్ చెప్పుకొచ్చారు.
విమానంలో సంభాషణ.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్:
ఒకసారి విమానంలో ఇద్దరూ కలిసి ఫ్యూచర్‌లో ఒకరు నటిస్తే మరొకరు నిర్మించాలని గట్టిగా అనుకున్నారట. ఆ 40 ఏళ్ల నాటి మాటను నిజం చేసే సమయం ఆసన్నమైందని, ఇటీవల కొత్త ఆర్‌కేఎఫ్‌ఐ ఆఫీస్ టెర్రస్‌పై కూర్చుని మాట్లాడుకున్నట్లు కమల్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇస్తూ.. కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో రాబోతున్న ‘ధర్మన్’ తో పాటు, వీరి కాంబోలోనే ‘KHxRK’ అనే మరో భారీ ప్రాజెక్ట్‌ను కూడా లైనప్‌లో పెట్టినట్లు ప్రకటించి మైండ్ బ్లాక్ చేశారు.
యాభై ఏళ్ల క్రితం నాటి ప్యూర్ స్నేహానికి, నమ్మకానికి నిదర్శనమే ఈ 'ధర్మన్' ప్రాజెక్ట్. చిన్న పాత్రల నుంచి ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగినా ఈ ఇద్దరి మధ్య గౌరవం అస్సలు తగ్గలేదు.ఇక ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ప్రాజెక్ట్ కోసం కలవడమే ఇండియన్ సినిమాకు ఒక పెద్ద పండుగ లాంటిది. మరి ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి..