పుత్రోత్సాహమ్ము .. చిరు ఎప్పుడూ ఇంత ఎగ్జ‌యిటింగ్‌గా లేరు!

ప్రధానమంత్రి నరేంద్ర మోది పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను 𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧 అని సంబోధించడం చిరును ఎంతో ఎగ్జ‌యిట్ చేస్తోంది.

Update: 2026-06-24 13:06 GMT

ఒక ప‌బ్లిక్ వేదిక‌పై.. ఒక జాతీయ చానెల్ కార్య‌క్ర‌మంలో దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌మ‌క్షంలో త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌ని 𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧 అంటూ కీర్తిస్తుంటే, ఆ కార్య‌క్ర‌మాన్ని వీక్షించే తండ్రిలోని ఎమోష‌న్ ఎలా ఉంటుందో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని చూస్తే అర్థ‌మ‌వుతోంది.

``పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!`` అంటూ చిరు ఎంతో ఎమోష‌న‌ల్‌గా త‌న‌యుడి గురించి ప‌ద్యాన్ని గుర్తు చేసుకుని మ‌రీ ఎమోష‌నల్ అవుతున్నారు. నిన్న సాయంత్ర‌మే పెద్ది స‌క్సెస్ వేదిక‌పై చిరు ఎంతో ఎగ్జ‌యిట్ అవుతూ.. న్యూ ఏజ్ మెగాస్టార్ అంటూ `రిప‌బ్లిక్ కాన్ క్లేవ్`లో చ‌ర‌ణ్ ని ప్రశంసించ‌డం చూసాన‌ని, ఇది త‌న‌కు ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోది పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను 𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧 అని సంబోధించడం చిరును ఎంతో ఎగ్జ‌యిట్ చేస్తోంది. ఈ కార్యక్ర‌మంలో చ‌ర‌ణ్ తో క‌ర‌చాల‌నం చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోటోని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన చిరు ఈ ఆనంద క్ష‌ణాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ``ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం. ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని త‌న ఇన్ స్టాగ్ర‌మ్ లో పోస్ట్ చేసారు.

`పెద్ది` సినిమా కోసం రామ్ చ‌ర‌ణ్ ఎలాంటి రిస్కులు చేసారో `పెద్ది` వేదిక‌పై గుర్తు చేసుకున్న చిరంజీవి... తమ కుటుంబం ఎప్పుడూ సోంబేరి(సోమ‌రి)లా ఉండ‌ద‌ని, ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసి దీనిని సాధించుకున్నామ‌ని కూడా వ్యాఖ్యానించారు. నిజానికి ఇలాంటి ఎగ్జ‌యిటింగ్ ఎమోష‌న‌ల్ మూవ్ మెంట్ మ‌రొక‌టి చిరు లైఫ్ లో లేనే లేదేమో! స్పోర్ట్స్ డ్రామాలో చ‌ర‌ణ్ న‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌శంస‌లు చిరును అంత‌గా ఎగ్జ‌యిట్ చేసాయి. త‌న‌ న‌ట‌ వార‌స‌త్వాన్ని ముందుకు తీసుకెళుతున్న చ‌ర‌ణ్ ని పుష్ చేస్తూ తాను తెర‌వెన‌కే ఉంటాన‌ని కూడా చిరు వ్యాఖ్యానించ‌డం చూస్తుంటే, ఇప్పుడు పూర్తిగా `న్యూ ఏజ్ మెగాస్టార్` విషయంలో ధృఢమైన న‌మ్మ‌కం క‌నిపిస్తోంది. అది హృద‌యం నుంచి పుట్టుకొచ్చిన గ‌ర్వాన్ని సూచిస్తోంది. మ‌గ‌ధీర‌, రంగస్థ‌లం చిత్రాల త‌ర్వాత `పెద్ది` చిత్రం మెగాస్టార్ ని చాలా ఎగ్జ‌యిట్ చేసింది. ఇక సుకుమార్ తో ఆర్.సి 17 చిత్రంలో చ‌ర‌ణ్ త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో ఏకంగా జాతీయ అవార్డ్ ని ఆశిస్తున్నార‌ని భావించ‌వ‌చ్చు. అయితే ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే మెచ్చుకోలును మించిన అవార్డ్ లేద‌ని కూడా చిరు పెద్ది వేడుక‌లో వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.

Tags:    

Similar News