ప్లాప్ సినిమా సీక్వెల్ కి హీరో సిద్దంగా!

షారుక్ ఖాన్ హీరోగా అనుభ‌వ్ సిన్హా తెర‌కెక్కించిన సూప‌ర్ హీరో థ్రిల్ల‌ర్ `రావ‌న్` భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-11-22 14:30 GMT

షారుక్ ఖాన్ హీరోగా అనుభ‌వ్ సిన్హా తెర‌కెక్కించిన సూప‌ర్ హీరో థ్రిల్ల‌ర్ `రావ‌న్` భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. 15 ఏళ్ల క్రితం ఈ చిత్రాన్ని షారుక్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై నిర్మించారు. అప్ప‌టికి దేశంలో సూప‌ర్ హీరో థ్రిల్ల‌ర్ పెద్ద‌గా రాలేదు. ఓ స‌రికొత్త ప్ర‌యత్నంగా షారుక్ చేసారు. ఎన్నో ఆశ‌లు ఈ ప్రాజెక్ట్ పై షారుక్ పెట్టుకున్నారు. విజ‌యంతో? బాలీవుడ్ లో ఓ కొత్త శైలికి నాంది ప‌లికిన‌ట్లు అవుతుంద‌ని భావించారు. హాలీవుడ్ యానిమేష‌న్ సినిమాల ప్ర‌భావం కూడా భార‌తీయుల‌పై ఉండ‌టంతో? భారీ విజ‌యం ఖాయ‌మనుకున్నారు.

కానీ షారుక్ అనుకున్న‌ది ఏదీ కూడా జ‌ర‌గ‌లేదు. ఓ కొత్త ప్ర‌య‌త్నంగా భావించారు త‌ప్ప అది ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుందా? లేదా? అన్న‌ది అంచ‌నా వేయడంలో విఫ‌ల‌మ‌య్యారు. తాజాగా ఇదే విష‌యాన్ని షారుక్ అంగీక‌రించారు. `రావ‌న్` తో గొప్ప సినిమా తీసాన‌నుకున్నా. కానీ అది అంచ‌నాలు అందుకోలేదు. అప్ప‌ట్లో ఇలాంటి సినిమాల‌కు ఎలాంటి ప్రాధ‌న్య‌త లేద‌ని త‌ర్వాత అర్ద‌మైంది. అదే సినిమా ఇప్పుడు తీసి ఉంటే పెద్ద విజ‌యం సాధించేదేమో. కానీ ఈ సినిమా సీక్వెల్ తీయ‌డానికి తాను సిద్దంగా ఉన్నాన‌`న్నారు.

అనుభ‌వ్ సిన్హా ఒకే చెబితే గ‌నుక `రావ‌న్` వ‌ర‌ల్డ్ లోకి మ‌ళ్లీ అడుగు పెట్ట‌డానికి తాను రెడీ అనేసారు. దీంతో మ‌ళ్లీ నెట్టింట `రావ‌న్` చ‌ర్చ మొద‌లైంది. `రావ‌న్` అప్ప‌ట్లో అడ్వాన్స్ మూవీ. ఆ స‌మ‌యంలో హాలీవుడ్ యానిమేష‌న్ సినిమాలు రిలీజ్ అయ్యేవి. వాటికీ పెద్ద‌గా ద‌ర‌ణ ఉండేది కాదు. ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ మాత్ర‌మే వాటిని ఆస్వాదించేవారు. ప్ర‌త్యేకించి నార్త్ ఆడియ‌న్స్ వీక్షించే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వినూత్న క‌థ‌ల‌కు..మేకింగ్ కు ప్రేక్ష‌కులు పెద్ద పీట వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే `మహావ‌తార్ న‌ర‌సింహ‌` క‌థ‌కు యానిమేష‌న్ రూపం ఇచ్చి రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. సౌత్ లో ఇలాంటి ప్ర‌యోగం చేయ‌డం ఇదే తొలిసారి.

ఇప్పుడా స‌క్సెస్ స్పూర్తితో మ‌రిన్ని మ‌హావ‌తార్ క‌థ‌లు హోంబ‌లే ఫిల్మ్స్ తెర‌పైకి తీసుకొస్తుంది. ఇప్ప‌టికే వాటి రిలీజ్ ప్ర‌ణాళిక కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో షారుక్ `రావ‌న్` సీక్వెల్ ఐడియా కూడా మంచిదే అన్న పాజిటివ్ టాక్ నెటి జ‌నుల నుంచి వ‌స్తొంది. హిట్ అవ్వాల్సిన చాలా సినిమాలు స‌రైన స‌మయంలో రిలీజ్ కాకపోవ‌డంతో హిట్ అవ్వ‌డం లేదు అన్న‌ది చాలా కాలంగా ఉంది. అలాంటి సినిమాలు టీవీల్లో దిగ్విజ‌యంగా ఆడాయి. `ఖ‌లేజా` థియేట్రిక‌ల్ గా ప్లాప్. కానీ టీవీలో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News