వర్క్ విషయంలో ఎప్పుడూ సంతోషంగా లేను
ఎన్నో సాధారణ కథలను కూడా తన కెమెరా పనితనంతో గొప్ప గొప్ప దృశ్యాలుగా మార్చిన సెంథిల్ కుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్లవుతోంది.;
ఎన్నో సాధారణ కథలను కూడా తన కెమెరా పనితనంతో గొప్ప గొప్ప దృశ్యాలుగా మార్చిన సెంథిల్ కుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్లవుతోంది. పలు గొప్ప కథలను అందరికంటే ముందుగా తన కెమెరా కన్నుతో చూసిన సెంథిల్ తన జర్నీపై మాట్లాడారు. దర్శకధీరుడు రాజమౌళి నుంచి వచ్చిన సినిమాల్లోని విజువల్స్ కు అంత భారీ ప్రాముఖ్యత దక్కడానికి గల కారణాల్లో సెంథిల్ కూడా ఒకరు.
ప్రతీ సినిమా మొదటి సినిమానే
తన జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయిందని సెంథిల్ ను అడిగితే నిజంగా అసలు తానింత దూరం ఎలా వచ్చానో తనక్కూడా తెలియదని, ప్రతీ సినిమా మొదటి సినిమాలానే అనిపించిందని చెప్పుకొచ్చారు. అయితే కథను తెరకెక్కించడానికి విజువల్స్ విషయంలో పర్టిక్యులర్ ఫార్ములా ఏమీ లేదని, ప్రతీ సినిమా స్పెషలేని, డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడనే దానిపైనే అది ఆధారపడుతుందని చెప్పారు.
ఆడియన్స్ సినిమా చూసే విధానం మారిపోయింది
ప్రతీ సినిమా రెండు ప్రశ్నలతో స్టార్ట్ అవుతుందని, కథ దేని గురించి అని ఒకటి, డైరెక్టర్ దాన్ని ఎలా చెప్పాలనుకుంటున్నారనేది మరొకటి అని చెప్పిన సెంథిల్, గత పాతికేళ్లలో టెక్నాలజీ చాలా దారుణంగా మారిందని, ఆడియన్స్ ఇప్పుడు ఫోన్లు, ఓటీటీ లాంటి ఎన్నో ఫార్మాట్స్ లో కంటెంట్ ను వినియోగిస్తున్నారని, ప్రస్తుతం ఆడియన్స్ సినిమా చూసే విధానం మారిపోయిందని, ఆ మార్పుకు తగ్గట్టు మనం కూడా మారి ప్రవర్తించాలని సెంథిల్ అన్నారు.
రెండు సెకన్ల ఫ్రేమ్ వెనుక ఎంతో కష్టం
విజువల్స్ చూడ్డానికి అందంగా ఉండేట్టు తీయకండి, మనం చూసేది నిజమనిపించేలా చేయండి అని రాజమౌళి చెప్తుండేవారని తెలిపారు. అందులో భాగంగానే స్క్రీన్ పై రెండు సెకన్ల పాటూ కనిపించే ఓ పర్ఫెక్ట్ ఫ్రేమ్ కోసం తాను క్రేన్ల వెనుక పరిగెడుతూ, లైట్స్ తో ఫైట్ చేస్తూ ఉండేవాడినని ఒకప్పటి షూటింగ్ డేస్ ను గుర్తు చేసుకున్నారు.
తానెప్పుడూ వర్క్ విషయంలో పూర్తి సంతోషంగా ఉండనని, బాహుబలిని రీరిలీజ్ చేసినప్పుడు కూడా తాను మళ్లీ కొన్ని కలర్స్ ను ఫిక్స్ చేశానని, మనం ఇప్పుడు ఏ పని చేసినా, దీన్ని తర్వాత ఇంకా బాగా చేయగలమనిపిస్తుందని, బాహుబలి సినిమా అప్పట్లోనే చాలా గ్రాండ్ విజువల్స్ తో రాగా, రీసెంట్ గా రీరిలీజ్ లో ఆ విజువల్స్ నెక్ట్స్ లెవెల్ లో అనిపించిన మాట వాస్తవం. ఇక తర్వాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ స్వయంభు, ది ఇండియా హౌస్ చేస్తున్నానని, ఆ రెండూ పూర్తిగా భిన్న ప్రపంచాలని, అన్నీ ఒకే తరహా ప్రాజెక్టులు చేయడం తనకు నచ్చదని, ఇలా డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తేనే బోర్ కొట్టకుండా ఉంటుందని సెంథిల్ తెలిపారు.