50 ఏళ్లు దాటిన న‌టీమ‌ణులు..వివాహానికి దూరంగా!

వివాహానికి దూరంగా మేల్-పీమేల్ సెల‌బ్రిటీలు చాలా మంది ఉన్నారు. ధాంప‌త్య జీవితం కంటే సింగిల్ లైఫ్ నే సో బెట‌ర్ అనే మ‌హిళా మ‌ణుల సంఖ్య చాలా పెద్ద‌దే.;

Update: 2025-09-27 03:15 GMT

వివాహానికి దూరంగా మేల్-పీమేల్ సెల‌బ్రిటీలు చాలా మంది ఉన్నారు. ధాంప‌త్య జీవితం కంటే సింగిల్ లైఫ్ నే సో బెట‌ర్ అనే మ‌హిళా మ‌ణుల సంఖ్య చాలా పెద్ద‌దే. కొంత మంది వివిధ కార‌ణాల‌తో వివాహానికి దూరంగా ఉంటే మ‌రికొంత మంది వివాహం లేకుండా జీవితం ఉండ‌దా? అని ధాటిగా ప్ర‌శ్నించే వ‌ర్గం ఉంది. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే 50 ఏళ్లు దాటినా వివాహాం చేసుకోని ఓ న‌లుగురు న‌టీమ‌ణుల గురించి తెలుసుకురంటే..

కేర‌ళ‌కు చెందిన‌ సీనియ‌ర్ న‌టి శోభ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా తెలిసిన న‌టి. ఎన్నో సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించి చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. గొప్ప డాన్స‌ర్ గా పేరుంది. అలాంటి న‌టి వివాహానికి దూరంగా ఉన్నారు.

త‌న‌కు పెళ్లి చేసుకోవ‌డం ఎంత మాత్రం ఇష్టం లేద‌ని చాలా సంద‌ర్భాల్లో తెలిపారు. వివాహ వ్య‌వ‌స్థ‌పై త‌న‌కు ఎంత మాత్రం న‌మ్మ‌కం లేద‌న్నారు.పెళ్లి చేసుకుంటే వ్య‌క్తిగ‌త స్వేచ్చ ఉండ‌ద‌న్న‌ది ఆమె అభిప్రాయం. సింగిల్ గా ఉండ‌ట‌మే త‌న‌కు సంతోషాన్నిస్తుంద‌న్నారు. మ‌రో సీనియ‌ర్ న‌టి న‌గ్మ కూడా సింగిలే.

నగ్మ వ‌య‌సు స‌రిగ్గా 50 ఏళ్లు. కానీ పెళ్లికి దూరంగా ఉన్నారు. మాజీ క్రికెట‌ర్ సౌర‌వ్ గంగూలీని ఎంత‌గానో ప్రేమించారు. వివాహం చేసుకోవాల‌నుకున్నారు. కానీ సౌరవ్ కెరీర్ కోసం త‌న ప్రేమ‌నే త్యాగం చేసారు. అదే ఆమె మొద‌టి ల‌వ్ ...చివ‌రి ల‌వ్ గా మిగిలిపోయింది. కానీ పెళ్లి అంటే ఇష్టం అంటారు. వివాహ వ్య‌వ‌స్థ‌ను తానెంత‌గానో గౌర‌విస్తాన‌న్నారు.మ‌రో సీనియ‌ర్ న‌టి సితారకు కూడా 50 దాటింది. కానీ వివాహం చేసుకోలేదు. ఎన్నో పెళ్లి ప్ర‌పోజ‌ల్స్ వ‌చ్చినా? త‌ల్లిదండ్రులు కార‌ణంగా వివాహం చేసుకోన‌ట్లు గ‌తంలో తెలిపారు.

సితార తల్లిదండ్రులు వైద్యుల బోర్డులో అధికా రులుగా ప‌ని చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటే త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలి దూరంగా ఉండాల‌ని అనుకున్నారు. ఆ త‌ర్వాత తండ్రి మ‌ర‌ణించారు. ఆ ఘ‌ట‌న తో ఒంట‌రి జీవిత‌మే ఉత్త‌మంగా భావించి ముందుకెళ్తున్న‌ట్లు తెలిపారు. బాలీవుడ్ న‌టి అమీషా ప‌టేల్ వ‌య‌సు కూడా ఐదు పదులు దాటింది. అమ్మ‌డి కెరీర్లో చాలా ఎఫైర్లు ఉన్నాయి. కానీ త‌న మ‌న‌సు అర్దం చేసుకున్న వ్య‌క్తి దొర‌కక‌పోవ‌డంతో వివాహానికి దూరంగా ఉన్న‌ట్లు తెలిపారు. మ‌రోన‌టి కౌస‌ల్య కూడా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి విష‌యంలో ర‌క‌ర‌కాల ఆలోచ‌న‌ల‌తో పెళ్లికి దూరంగా ఉన్న‌ట్లు గ‌తంలో తెలిపారు. ఇప్ప‌టికీ ఆమె సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు.

Tags:    

Similar News