• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శేఖ‌ర్ క‌మ్ముల కూడా...

శేఖ‌ర్ క‌మ్ముల కూడా సందీప్‌రెడ్డిని ఫాలో అవుతున్నాడే!

| సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో మ‌రో రెండు, మూడు రోజుల్లో ట్రైల‌ర్ రిలీజ్ చేయాల‌ని టీమ్ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2025-05-24 19:30 GMT

టాలీవుడ్‌లో కొత్త సంప్ర‌దాయానికి తెర లేపిన ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ‌. ఆయ‌న విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ `అర్జున్ రెడ్డి`. ఈ సినిమా నిడివి ప‌రంగానూ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. కొత్త హీరో, ర‌న్ టైమ్ మూడు గంట‌ల 6 నిమిషాలు ఈ రోజుల్లో ఎవ‌రు చూస్తారు అని అంతా కామెంట్‌లు చేశారు. నిడివి త‌గ్గించ‌మ‌ని సందీప్‌ని ఫోర్స్ చేశారు. కానీ కంటెంట్‌పై ఉన్న న‌మ్మ‌కంతో సందీప్ అందుకు అంగీక‌రించ‌కుండా 3 గంట‌ల 6 నిమిషాల ర‌న్ టైమ్‌తో ఈ మూవీని విడుద‌ల చేయ‌డం అది బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం తెలిసిందే.

ఈ సినిమా త‌రువాత ర‌న్ టైమ్ గురించి ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. చాలా వ‌ర‌కు డైరెక్ట‌ర్లు ఈ విష‌యంలో సందీప్‌రెడ్ది వంగ‌నే ఫాలో అవుతున్నారు. సుకుమార్ కూడా `పుష్ప 2` కోసం సందీప్‌నే ఫాలో అయ్యాడు. ఈ సినిమా ర‌న్‌ టైమ్ 3 గంట‌ల 21 నిమిషాలు. ఆ త‌రువాత కూడా చాలా వ‌ర‌కు డైరెక్ట‌ర్లు ర‌న్ టైమ్‌ని ఫాలో అవుతూ వ‌స్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో సెన్సిబుల్ మూవీస్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న శేఖ‌ర్ క‌మ్ముల చేరారు.

ఆయ‌న తెర‌కెక్కిస్తున్న తాజా మూవీ `కుబేర‌`. ధ‌నుష్ హీరోగా కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్ప ఈ మూవీలో హీరో ధ‌నుష్ బిచ్చ‌గాడి పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఓ బిచ్చ‌గాడికి, ఓ కోటీశ్వ‌రుడికి మ‌ధ్య సాగే స‌మ‌రం నేప‌థ్యంలో ఎమోష‌న‌ల్ డ్రామాగా ఈ మూవీని ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ సినిమాని జూన్ 20న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయ‌బోతున్నారు.

సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో మ‌రో రెండు, మూడు రోజుల్లో ట్రైల‌ర్ రిలీజ్ చేయాల‌ని టీమ్ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ర‌న్ టైమ్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సినిమా ర‌న్ టైమ్ 2 గంట‌ల 50 నిమిషాలు. అంటే దాదాపుగా మూడు గంట‌ల‌న్న‌మాట‌. శేఖ‌ర్ క‌మ్ముల మూడు గంట‌ల నిడితో చేసిన తొలి సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. అయితే ర‌న్ టైమ్ విష‌యంలో టీమ్ టెన్ష‌న్‌గా ఉంద‌ని, హిట్ అంటే జ‌నాలు చూస్తారు. ఓ మోస్తారుగా ఉందంటే ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని `కుబేర‌`టీమ్ టెన్ష‌న్ ప‌డుతోంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

Tags:    
  • Kubera 
  • SekharKammula 
  • Dhanush 
  • Nagarjuna 
  • RashmikaMandanna 
  • ArjunReddy 
  • Pushpa2 
  • TollywoodTrends 
  • MovieRuntime 
  • PanIndiaRelease 
  • SandeepReddyVanga 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS