• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కార్తీ సత్యం సుందరం...

కార్తీ సత్యం సుందరం టీజర్.. ఎలా ఉందంటే?

| దసరా కానుకగా సెప్టెంబర్ 28వ తేదీన మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

By - Tupaki Desk
Update: 2024-09-13 13:12 GMT

కోలీవుడ్ స్టార్ యాక్టర్లు కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో సత్యం సుందరం (మెయియాజగన్) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ సీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవ్వనుంది. దసరా కానుకగా సెప్టెంబర్ 28వ తేదీన మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు.

అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్.. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే తమిళ టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు టీజర్ ను విడుదల చేశారు. ల‌వ్ స్టోరీ జోనర్ లో వచ్చిన 96 మూవీతో మంచి పేరు సంపాదించుకున్న ప్రేమ్ కుమార్.. ఇప్పుడు సత్యం సుందరం కోసం ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నట్లు టీజర్ ద్వారా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కార్తీ, అర‌వింద్ స్వామి మంచి స్నేహితులుగా సినిమాలో కనిపించనున్నారు.

అరవింద్ స్వామి కళ్లను చేతులతో మూసి.. ఎవరో గుర్తుపట్టుకోండి చూద్దామంటూ కార్తీ అల్లరి చేసిన సీన్ తో టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇద్దరూ బావా బావా అంటూ ఫుల్ సందడి చేశారు. ఇద్దరూ కలిసి బయట తిరుగుతున్నట్లు చూపించారు. చివరకు అరవింద్ స్వామి.. చిన్నగా కోప్పడినట్లు చూపించినా తర్వాత కామెడీగా మాట్లాడుకున్నారు. మొత్తానికి క‌థ‌ను రివీల్ చేయ‌కుండా క్లాస్‌ గా ఉన్న టీజర్.. సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.

కార్తీ, అరవింద్ స్వామి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది. కార్తీ అమాయకత్వంతో కూడిన రోల్ లో కనిపిస్తుండగా.. అరవింద్ స్వామి రిజర్వ్‌డ్, అర్బన్ పర్సనాలిటీతో కనిపించారు. రెండు పాత్రలను ప్రేమ్ కుమార్ అద్భుతంగా తీర్చిదిద్దారు. మహేంద్రన్ జయరాజు కెమెరా పనితనం క్లాసీగా అనిపించింది. గోవింద్ వసంత బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాకు మంచి అసెట్ గా మారినట్లు తెలుస్తోంది.

సినిమాలో కార్తీ, అరవింద్ స్వామితో పాటు శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ ను కూడా గోవింద వసంతనే అందిస్తున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇక సత్యం సుందరం సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తుంది. ఎన్టీఆర్ దేవర సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతుంది. దీంతో సత్యం సుందరం ఎలాంటి వసూళ్లు సాధిస్తుందోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.


Full View


Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • SatyamSundaram 
  • Teaser 
  • Karthi 
  • Arvindswami 
  • GovindVasantha 
  • CPremkumar 
  • Suriya 
  • Jyotika 

Similar News

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

Copyright @2026

Powered by Blink CMS