సత్యదేవ్ పెద్ద పెద్ద డ్రీమ్స్‌...!

చాలా మంది కోహ్లీ, రోహిత్‌ శర్మ వంటి వారి బయోపిక్స్ లో నటించాలని అనుకుంటారు. కానీ నేను మాత్రం అంబటి రాయుడు బయోపిక్ చేయాలి అనుకుంటాను.

Update: 2024-05-09 11:41 GMT

విజయవాడ పేరు చెప్పగానే రాజకీయం మరియు రౌడీయిజం గుర్తుకు వస్తాయి. కానీ విజయవాడ అంటే అవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉంటాయి అని చెప్పేది మా కృష్ణమ్మ సినిమా అంటూ హీరో సత్యదేవ్‌ చెప్పుకొచ్చారు. వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన కృష్ణమ్మ సినిమాలో సత్యదేవ్‌ కి జోడీగా అతీరా రాజ్ హీరోయిన్ గా నటించింది.

మే 10న విడుదల కాబోతున్న కృష్ణమ్మ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా సత్యదేవ్‌ మీడియా ముందుకు వచ్చాడు. కృష్ణమ్మ సినిమా పై చాలా నమ్మకం వ్యక్తం చేసిన ఈయన తన భవిష్యత్తు ప్రాజెక్ట్‌ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా మంది కోహ్లీ, రోహిత్‌ శర్మ వంటి వారి బయోపిక్స్ లో నటించాలని అనుకుంటారు. కానీ నేను మాత్రం అంబటి రాయుడు బయోపిక్ చేయాలి అనుకుంటాను.

ఆయన బయోపిక్ కు నేను ఎంత వరకు సెట్‌ అవుతానో తెలియదు. కానీ నాకు ఆయన అంటే చాలా అభిమానం. ఆయన కెరీర్‌ లో చాలా అప్‌ అండ్‌ డౌన్స్ ఉంటాయి. అందుకే ఆయన బయోపిక్ చేయడం అనేది గౌరవంగా భావిస్తాను అన్నాడు.

ఇక తనకు కమల్‌ హాసన్ నటించిన నాయగన్, చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు, ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలు అంటే చాలా ఇష్టం. అలాంటి ప్రత్యేకమైన సినిమాల్లో పాత్రల్లో నటించాలి అనేది నా డ్రీమ్‌ అన్నాడు.

హీరోగా ఒక వైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా సినిమాల్లో నటించడం పై స్పందిస్తూ నా అవసరం ఉంది అనుకున్న ప్రతి సినిమాలో నేను నటిస్తాను. నా నుంచి ప్రేక్షకులు ఆశించేది, దర్శకులు ఆశించేది ఇవ్వడమే నా లక్ష్యం అన్నాడు.

మొత్తానికి సత్యదేవ్‌ డ్రీమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ముందు ముందు ఆయన సినిమాలు ఆ స్థాయిలో ఉండాలని ఆయన ఫ్యాన్స్ మరియు సన్నిహితులు కూడా కోరుకుంటున్నారు. విలక్షణ పాత్రలు పోషిస్తూ, విభిన్నమైన సినిమాలను చేస్తున్న సత్యదేవ్‌ కు 'కృష్ణమ్మ' ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది చూడాలి.

Tags:    

Similar News