RRR, బాహుబలి, రావ్ బహదూర్.. వెంకటేష్ మహా ఆ స్థాయిలో తీశాడా?

పర్ఫెక్ట్ సినిమా లవర్స్ కు ఎక్కువగా నచ్చే సినిమాల్లో కేరాఫ్ కంచెరపాలెం టాప్ లిస్టులో ఉంటుంది. అయితే ఆ దర్శకుడిని వస్తున్న నెక్స్ట్ మూవీ రావ్ బహదూర్.

Update: 2026-06-13 08:11 GMT

పర్ఫెక్ట్ సినిమా లవర్స్ కు ఎక్కువగా నచ్చే సినిమాల్లో కేరాఫ్ కంచెరపాలెం టాప్ లిస్టులో ఉంటుంది. అయితే ఆ దర్శకుడిని వస్తున్న నెక్స్ట్ మూవీ రావ్ బహదూర్. టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా సైకలాజికల్ డ్రామాగా ఉండనుంది. ఇక గతంలో KGF లాంటి కమర్షియల్ సినిమాల గురించి వెంకటేష్ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సత్యదేవ్ చేసిన కామెంట్స్ మళ్ళీ అదే రేంజ్ లో హాట్ టాపిక్ గా వైరల్ అయ్యేలా ఉన్నాయి.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో టీజర్ లోని విజువల్స్ తో పాటు స్టేజ్ మీద సత్యదేవ్ మాట్లాడిన మాటలు ఓ వర్గం వారికి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ ఈవెంట్ లో సత్యదేవ్ తన సినిమాపై ఉన్న నమ్మకంతో ఏకంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్స్ తో రావ్ బహదూర్ ను పోల్చాడు. భవిష్యత్తులో మన తెలుగు సినిమా గొప్పదనం గురించి మాట్లాడుకుంటే.. ఆ రెండు క్రేజీ సినిమాల పక్కన రావ్ బహదూర్ పేరు కూడా కచ్చితంగా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చాడు.

జనరల్ గా ఇలాంటి పెద్ద పోలికలు తెచ్చినప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ గట్టిగానే పడతాయి. కానీ సత్యదేవ్ లాంటి కంటెంట్ నమ్ముకునే హీరో ఈ మాట చెప్పడంతో అసలు దీని వెనుక లాజిక్ ఏంటని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఆయన ఈ పోలికను బాక్సాఫీస్ కలెక్షన్స్ యాంగిల్ లో చెప్పలేదని, కేవలం మేకింగ్ స్టాండర్డ్స్ పరంగానే ఈ కామెంట్స్ చేశాడని ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది.

రాజమౌళి తెరకెక్కించిన ఇండస్ట్రీ హిట్స్ పేర్లను వాడటం ద్వారా సత్యదేవ్ ఈ సినిమాపై జనాల్లో ఒక బజ్ తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. కమర్షియల్ హంగులు, మాస్ ఫైట్లు లేకపోయినా.. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇంటర్నేషనల్ లెవెల్ కు తగ్గట్లుగా వెంకటేష్ మహా ఈ చిత్రాన్ని ఎలా మలిచాడో చెప్పడానికే ఆయన అలా మాట్లాడి ఉంటాడని చాలామంది ఫీల్ అవుతున్నారు.

సత్యదేవ్ చేసిన ఈ కామెంట్స్ పై ఆడియన్స్ నుంచి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. సినిమా రిలీజ్ కు ముందే అంత పెద్ద ఎపిక్ సినిమాలతో పోల్చుకోవడం కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో అని కొందరు అంటున్నారు. ఇంకొందరు మాత్రం కంటెంట్ పై ఆ టీమ్ కు ఉన్న నమ్మకానికి ఇది ప్రూఫ్ అని, క్వాలిటీ నిజంగా అంత బాగుంటే ఆ రెస్పెక్ట్ దక్కుతుందని సపోర్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతానికైతే సత్యదేవ్ స్పీచ్ తో సినిమా చుట్టూ ఒక వైబ్ అయితే క్రియేట్ అయింది. అయితే ఒక సైకలాజికల్ డ్రామా నిజంగానే ఆ రేంజ్ స్టాండర్డ్స్ తో ఉందా లేదా అనేది జూలై 3న థియేటర్లలోకి వచ్చాకే క్లారిటీ వస్తుంది.



Tags:    

Similar News