సర్జమీన్ టాక్ ఏంటి..?
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ సర్జమీన్. పృథ్వీరాజ్, కాజోల్, ఇబ్రహీం అలి ఖాన్, బొమ్మన్ ఇరానీ ఈ సినిమాలో నటించారు.;
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ సర్జమీన్. పృథ్వీరాజ్, కాజోల్, ఇబ్రహీం అలి ఖాన్, బొమ్మన్ ఇరానీ ఈ సినిమాలో నటించారు. కయోన్ ఇరాని ఈ మూవీని డైరెక్ట్ చేశారు. కశ్మీర్ ఉగ్రదాడులు అక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్ విజయ్ మీనన్ కథతోనే ఈ సినిమా తెరకెక్కించారు. దేశభక్తి నేపథ్యంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చింది ఈ సర్జమీన్. లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సర్జమీన్.
ఇంతకీ సర్జమీన్ కథ ఏంటంటే.. కశ్మీర్ లో ఉగ్రదాడులు జరుగుతున్న టైం లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. ఐతే ఈ దాడుల వెనక ఉన్న కాబిల్ అలియాస్ మోసెన్ ని పట్టుకోవాలని తన టీం తో రంగంలోకి దిగుతాడు విజయ్ మీనన్ (పృథ్వీరాజ్ సుకుమారన్). నిలువెల్లా దేశభక్తి నిండిన విజయ్ మేనన్ కాబిల్ ని కంట్రోల్ లో ఉంచుకుంటాడు. ఐతే ఈ క్రమంలోనే విజయ్ మేనన్ కొడుకు హర్మాన్ ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. కాబిల్ ని విడిచి పెట్టకపోతే హర్మన్ ని చంపేస్తామని హెచ్చరిస్తారు. ఆ టైం లో విజయ్ మీనన్ ఏం చేశాడు.. కొడుకుని రక్షించుకుంటాడా...? దేశాన్ని కాపాడుకుంటాడా అన్నది సినిమా కథ.
దేశభక్తితో ముఖ్యంగా ఉగ్రవాదం నేపథ్యంతో వచ్చిన ఆర్మీ సోల్జర్స్ కథలన్నీ కూడా కేవలం పేట్రియాటిక్ అంశాన్ని తీసుకొని చూపిస్తారు. ఐతే ఈమధ్య ఇలాంటి కథల్లో కూడా ఎమోషన్ ని జోడిస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చిన అమరన్ సినిమా ఇందుకు ఉదహరణ. శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించిన అమరన్ సినిమా కూడా రియల్ లైఫ్ కథతో వచ్చింది. ఆ సినిమాలో ఎమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి.
ఐతే సర్జమీన్ ఒక కల్పిత కథ. ఇందులో కూడా ఎమోషనల్ గా వర్క్ అవుట్ చేయాలని అనుకున్నారు. కానీ అది అంతగా వర్క్ అవుట్ కాలేదు. సినిమా కోసం పృధ్విరాజ్ మంచి ఎఫర్ట్ పెట్టారు. కానీ అంతగా ఎమోషనల్ టచ్ ఇవ్వలేదు. హర్మన్ కి ఉన్న లోపం.. అతని ప్రవర్తన విజయ్ మీనన్ అతనిపై చూపించే డిజప్పాయింట్ ఇవన్నీ జస్ట్ ఓకే అనిపిస్తాయి.
దేశభక్తి కథలను ఒక కమర్షియల్ సినిమా తీసేలా చేస్తే కుదరదు. సర్జమీన్ స్క్రీన్ ప్లే విషయంలో కాస్త లోటుపాట్లు ఉన్నాయి. దేశభక్తి, ఫ్యామిలీ ఎమోషన్ ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయాలనుకున్న డైరెక్టర్ సరైన ట్రాక్ ఎక్కించలేకపోయాడు. ఐతే కొంతమేర తెర మీద పర్ఫార్మెన్స్ ల వల్ల మరీ అంతగా బోర్ కొట్టదు.