'స‌ర్దార్ 2' తెలివైన ప‌ని..అంచ‌నాలు పీక్స్ లో!

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో స్పై థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. `ధురంధ‌ర్` రిలీజ్ అయిన ద‌గ్గ‌ర నుంచి `ధురంధ‌ర్ 2` రిలీజ్ పై ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసారు.;

Update: 2026-03-29 02:45 GMT

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో స్పై థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. `ధురంధ‌ర్` రిలీజ్ అయిన ద‌గ్గ‌ర నుంచి `ధురంధ‌ర్ 2` రిలీజ్ పై ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసారు. ఈ మ‌ధ్య కాలంలో ఏ సినిమా రిలీజ్ కోసం ప్రేక్ష‌కులు అంత‌గా ఎదురు చూసింది లేదు. `ధురంధ‌ర్` రిలీజ్ పైనే స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రిగింది. ఆ ర‌కంగా ధురంధ‌ర్ అనే స్పై సినిమా ప్రేక్ష‌కుల్లో ఎంత బ‌లమైన ప్ర‌భావాన్ని చూపించిద‌న్న‌ది అంచ‌నా వేయోచ్చు. ఇటీవ‌లే రిలీజ్అయిన `ధురంధ‌ర్ ది రివేజ్` ఎంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. దీంతో స్పై సినిమాల గ్రాఫ్ అంత‌కంత‌కు మార్కెట్ లో పెరిగింది.

ఒక‌ప్పుడు స్పై సినిమాలంటే కేవ‌లం బాలీవుడ్ మార్కెట్ కే ప‌రిమిత‌మ‌య్యేవి. కానీ నేడు సీన్ మారింది. పాన్ ఇండియాలో స్పై క‌థ‌కు ప్రేక్ష‌కుల‌కు అంతే క‌నెక్ట్ అవుతున్నారు. `ధురంధ‌ర్ 2` 1000 కోట్ల క్ల‌బ్ లో వారం వ్య‌వ‌ధిలో చేర‌డ‌మే అందుకు ఉదాహ‌ర‌ణ‌. గూఢచారి వ్యవస్థ, దేశభక్తి ,హై-వోల్టేజ్ యాక్షన్ అంశాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సానుకూల వాతావరణం ఇప్పుడు కోలీవుడ్ స్టార్ కార్తీ నటిస్తోన్న `సర్దార్ 2` చిత్రానికి కొండంత అండగా నిలవబోతోంది. ఇది నిజంగా చిత్ర యూనిట్ తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో `సర్దార్` మొదటి భాగం విడుదలైనప్పుడు తమిళంలో మంచి విజయం సాధించినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అప్పట్లో స్పై సినిమాలపై ప్రేక్షకులకు ఉన్న అవగాహన , ఆసక్తి పరిమితంగా ఉండటమే అందుకు కారణం. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. `ధురందర్` సిరీస్ తర్వాత స్పై స్టోరీలలోని లోతును, ఆ ఉత్కంఠను తెలుగు జనాలు బాగా ఓన్ చేసుకుంటున్నారు. ఈ క్రేజ్ `సర్దార్ 2` అంచనాలను అప్పుడే పీక్స్‌కు తీసుకెళ్లింది. దర్శకుడు పి.ఎస్. మిత్రన్ `సర్దార్ 2`ను మొదటి భాగం కంటే రెట్టింపు బడ్జెట్ భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిస్తున్నారు.

`గూఢచారి`గా కార్తీ పర్ఫార్మెన్స్ ఈసారి మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని సమాచారం. `ధురందర్ 2` విజయం అందించిన ఊపుతో? తెలుగు పంపిణీదారులు కూడా `స‌ర్దార్ 2` రైట్స్ కోసం భారీగా పోటీ పడుతున్నట్లు స‌మాచారం. స్పై జోనర్‌కు ఇప్పుడున్న డిమాండ్‌ను బట్టి చూస్తే? ఈ సినిమాకు తెలుగులో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జ‌రిగితే కొన్నాళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో స్పై సినిమాల హవానే న‌డుస్తుంది. ప్రేక్షకులు ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు , అంతర్జాతీయ కుట్రల నేపథ్యంలో సాగే కథలను ఇష్టపడుతున్నారు. ఐరన్ వేడిగా ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలన్న సామెతలా స్పై సినిమాల ఫీవర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఈ జాన‌ర్ చిత్రాల‌ను చేసి కాసులు చేసుకోవ‌చ్చు.

Tags:    

Similar News