మీడియం రేంజ్ హీరోలతో పోలిస్తే టైర్ వన్ హీరోలకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి..?

ఇక ఇదిలా ఉంటే టైర్ వన్ హీరోల సినిమాలకి మీడియం రేంజ్ హీరోలకి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే స్టార్ హీరోల సినిమాలు అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో హైప్ ని క్రియేట్ చేసుకుంటాయి.

Update: 2026-09-16 02:45 GMT

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోలకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఒక నటుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తాడు. హీరోలకు స్టార్ డమ్ రావడం ఈజీ నే కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం...ఒకానొక సందర్భంలో ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క హీరోకి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ప్రేక్షకుల అభిరుచి ఏంటి? మనం ఎలాంటి సినిమాలు చేయాలి? మన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మనకి ఎలాంటి కధలు సెట్ అవుతాయనే ఒక డైలమా లో ఉన్నప్పుడు చాలా బాగా ఆలోచించి ముందుకు సాగాల్సి ఉంటుంది. స్టోరీల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరించినప్పుడు మాత్రమే హీరోలకు సక్సెసులు వస్తాయి. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న టైర్ వన్ హీరోలు పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. మీడియం రేంజ్ హీరోలు మాత్రం డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా 'బాహుబలి' సినిమా వచ్చిన తర్వాత ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరు తెలుగు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసే రోజులైతే వచ్చాయి. ప్రస్తుతం రాజమౌళి లాంటి దర్శకుడు సైతం మహేష్ బాబుతో 'వారణాసి' అనే హై బడ్జెట్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఎడాది ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది...

ఇక ఇదిలా ఉంటే టైర్ వన్ హీరోల సినిమాలకి మీడియం రేంజ్ హీరోలకి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే స్టార్ హీరోల సినిమాలు అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో హైప్ ని క్రియేట్ చేసుకుంటాయి. ఆ సినిమా నుంచి వచ్చే ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం తార స్థాయికి తీసుకెళ్తుంది. తద్వారా స్టార్ హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలైతే ఉంటాయి. మీడియం రేంజ్ హీరోల సినిమాలకు అలా కాదు సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత మౌత్ టాక్ వల్ల ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తేనే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు.

అందుకే టైర్ వన్ హీరోలకు మీడియం రేంజ్ హీరోలకు మధ్య చాలా తేడాలు ఉంటాయి. అందుకోసమే ప్రతి మీడియం రేంజ్ హీరో వరుస సక్సెస్ లను సాధించి టైర్ వన్ హీరోగా మారాలని చూస్తారు. ప్రస్తుతం ఉన్న కొంతమంది హీరోలకు టైర్ వన్ హీరోలుగా మారే అవకాశం వచ్చినప్పటికి వాళ్ళు దాన్ని అందుకోవడంలో తడబడుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సక్సెస్ ఫుల్ సినిమాలను చేసిన హీరోలు మాత్రమే టైర్ వన్ రేంజ్ ను చేయగలుగుతారనేది వాస్తవం...

Tags:    

Similar News