కుర్ర హీరోలు చిరంజీవి రేంజ్ కి ఎదగాలంటే వీటిని పాటించాల్సిందేనా...

చిరంజీవికి అన్ని క్రాఫ్ట్ ల మీద చాలా మంచి పట్టు ఉంది. ఒకసారి కథను విన్న తర్వాత ఆ కథలో ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్లు ఏమున్నాయి అనేది చాలా అలవోకగా చెప్పేస్తాడు.

Update: 2026-09-16 03:00 GMT

సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా రాణించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని... దానికోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిరంజీవి లాంటి నటుడు సైతం ఎలాంటి సపోర్టు లేకుండా వచ్చి పోరాటం చేశాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ తనకంటూ ఒక దారి వేసుకున్నాడు. కష్టాలను భరించాడు, ఇబ్బందులను ఎదిరించాడు, ఫైనల్ గా నటనపై ఆసక్తి చూపించాడు అందువల్లే తను మెగాస్టార్ గా మారాడు. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఆయన్ని ఢీకొట్టే హీరో మరెవరు లేరనెంత రేంజ్ లో తన పరిధిని విస్తరించుకున్నాడు. చిరంజీవి మధ్యలో రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికి అప్పటినుంచి ఇప్పటివరకు తన ప్లేస్ ను భర్తీ చేయగలిగే కెపాసిటి ఉన్న హీరో మరొకరు కనిపించడం లేదు. 2017 వ సంవత్సరంలో 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ మూవీ తో సక్సెస్ ని సాధించాడు.

అప్పటినుంచి వరుస సినిమాలను చేస్తున్నాడు. 'వాల్తేరు వీరయ్య', 'మన శంకర్ వరప్రసాద్' సినిమాలతో 300 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఆయన రాబోయే సినిమాలతో 500 కోట్ల కలెక్షన్స్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు సైతం చిరంజీవి మాదిరిగా వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు సాగితే వాళ్లు కూడా టాప్ హీరో రేంజ్ కి వెళ్లొచ్చు. ముఖ్యంగా చిరంజీవి లాంటి డెడికేషన్ తో ముందుకు సాగినప్పుడు మాత్రమే వాళ్ళు స్టార్ హీరోలు అవుతారనేది వాస్తవం.

చిరంజీవికి అన్ని క్రాఫ్ట్ ల మీద చాలా మంచి పట్టు ఉంది. ఒకసారి కథను విన్న తర్వాత ఆ కథలో ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్లు ఏమున్నాయి అనేది చాలా అలవోకగా చెప్పేస్తాడు. అలాగే ప్రతి దర్శకుడి ప్రతిభను తను ముందుగానే అంచనా వేయగలడు. అందుకే తన దగ్గరికి వచ్చిన మంచి కథలను కొంతమంది దర్శకుల చేతిలో పెట్టి దానికి ఒక అందమైన రూపాన్ని ఇవ్వడంలో చిరంజీవి ప్రతిసారి సక్సెస్ అవుతూనే వచ్చాడు. ఒకానొక సందర్భంలో ఆయన సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారాడు.

ఇక మూస ధోరణిలో వెళ్తున్న ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కిస్తూ తన డ్యాన్స్ స్టెప్పులతో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. అప్పుడే కాదు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం చిరంజీవి తన మార్కును చూపించాడు. ముఖ్యంగా ప్రతి విషయంలో మనకంటూ ఒక కొత్తదనాన్ని చూపించాలి అనే ఆలోచన ఉండి దానికి తగ్గట్టుగా కష్టపడితే ప్రతి హీరో కూడా మెగాస్టార్ రేంజ్ లో సక్సెస్ అవ్వచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న హీరోలు ఒక సక్సెస్ సాధిస్తే మరో మూవీతో డీలా పడిపోతున్నారు. ముఖ్యంగా వాళ్లు కథలను సెలెక్ట్ చేసుకోవడంలో ఎక్కడో లోపం జరుగుతుంది. దానిని కనక అధిగమించినట్టయితే మాత్రం యంగ్ హీరోలు కూడా స్టార్ హీరోల రేంజ్ ను టచ్ చేయొచ్చు...

Tags:    

Similar News