కార్తీ 'సర్దార్ 2'.. ఈసారి అంతకు మించి..

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Update: 2026-05-25 07:16 GMT

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2022లో వచ్చిన ఆ సినిమాలో తండ్రీకొడుకులుగా కార్తీ డ్యూయల్ రోల్, స్టైలిష్ యాక్షన్ సీన్స్, దేశభక్తి నేపథ్యంలో నడిచిన కథ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సర్దార్ 2పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే.. ఈసారి మేకర్స్ మొదటి భాగాన్ని మించే స్థాయిలో సినిమా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.




 


దర్శకుడు పీఎస్ మిత్రన్ రూపొందిస్తున్న ఆ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌ పై ఎస్‌. లక్ష్మణన్ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. సుమారు రూ.130 కోట్ల వ్యయంతో ఆ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో కూడా కార్తీ తండ్రీకొడుకులుగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఒకవైపు వృద్ధ గూఢచారి సర్దార్ పాత్ర, మరోవైపు యువ పోలీస్ ఆఫీసర్ విజయ్ పాత్ర కథలో కీలకంగా ఉండనున్నాయి.

ఈసారి కథను దర్శకుడు మరింత విస్తరించినట్లు తెలుస్తోంది. రచయిత రత్నకుమార్ చెప్పిన వివరాల ప్రకారం, సర్దార్ 2 మొదటి భాగానికి సీక్వెల్‌ గానే కాకుండా ప్రీక్వెల్‌ గానూ సాగనుంది. అంటే సర్దార్ ఎలా రా ఏజెంట్‌ గా మారాడు? అతని గతం ఏమిటి? అనే అంశాలను కూడా చిత్రంలో చూపించనున్నారు. అదే సమయంలో ప్రస్తుతం విజయ్ ఎదుర్కొనే కొత్త మిషన్ కూడా కథలో ప్రధానంగా ఉండబోతోంది.

ముఖ్యంగా ఆ సినిమాలో బ్లాక్ డ్యాగర్ అనే పవర్ ఫుల్ విలన్ ఎలిమెంట్‌ పరిచయం చేస్తున్నారు. మొదటి భాగంలో కార్పొరేట్ క్రైమ్ నేపథ్యం ఉంటే.. ఈసారి మ డేంజరెస్ ఇంటర్నేషనల్ కుట్రల చుట్టూ కథ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలన్ పాత్రలో నటిస్తున్న ఎస్ జే సూర్య సినిమాకు ప్రధాన బలం కానున్నారని టాక్ వినిపిస్తోంది.

హీరోయిన్లుగా మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ నటిస్తుండగా, రాజిషా విజయన్‌, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు సామ్ సీఎస్ మరోసారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ తో సినిమాకు హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్.. యాక్షన్ సీన్స్, విజువల్స్, కార్తీ మేకోవర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. ముఖ్యంగా కార్తీ బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ లో డప్పుల మధ్య సర్దార్ పాత్రలో ఆయన కనిపించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పోస్టర్ చూస్తేనే ఈసారి పాత్ర మరింత మాస్‌, ఎమోషనల్‌ గా ఉండబోతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. చిత్రబృందం కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

మొదట సినిమాను 2026 వేసవిలో విడుదల చేయాలని భావించినా.. కొన్ని కారణాలతో వాయిదా పడింది. ప్రస్తుతం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి సర్దార్ ఫస్ట్ పార్ట్ ఇచ్చిన థ్రిల్‌ ను కొనసాగిస్తూ.. ఇంకా భారీ రేంజ్ లో యాక్షన్, స్పై డ్రామాతో సర్దార్ 2 సిద్ధమవుతోంది. కథ, మేకింగ్, కార్తీ యాక్టింగ్ అన్నీ కలిస్తే.. ఈసారి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News