• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సారంగపాణి సాంగ్.. యమా...

సారంగపాణి సాంగ్.. యమా స్టైలిష్ గా ప్రియదర్శి, రూప!

| ప్రియదర్శి, రూప కొడువయూర్ హీరోహీరోయిన్లుగా సారంగపాణి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-10-27 07:30 GMT

ప్రియదర్శి, రూప కొడువయూర్ హీరోహీరోయిన్లుగా సారంగపాణి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్‌‌‌‌ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే తన బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించగా, ఇప్పుడు సారంగపాణిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జెంటిల్‌ మ్యాన్, సమ్మోహనం మూవీస్ తర్వాత మరోసారి మోహనకృష్ణతో చేతులు కలిపారు.

ఇప్పటికే సారంగపాణి షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు మేకర్స్. ఇదివరకే అనౌన్స్ చేసినట్లు డిసెంబర్ 20వ తేదీన మూవీ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకుగాను అప్పుడే ఏర్పాట్లు మొదలుపెట్టేశారు. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సారంగో సారంగా.. అమ్మాయి అవునంది ఏకంగా అంటూ సాగుతున్న ఆ పాట భారీ వ్యూస్ అందుకుంటోంది.

‘ఉల్లా ఉల్లా ఉల్లా ఉల్లాస కల్లోలం.. గల్లా గల్లా గంతులాడింది భూగోళం.. నీ సంబరం నీలాంబరం.. మేఘాల అంచుల్లో నుంచో బెట్టిందే మెళ్ళోన దండేసి ఛత్రం పట్టిందే అంటూ సాగుతున్న ఆ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. వివేక్ సాగర్ సమకూర్చిన మ్యూజిక్ అదిరిపోయింది. అర్మాన్ మాలిక్ ఎనర్జిటిక్‌‌ గా పాడి అందిరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ దినేష్ కొరియోగ్రఫీ కూడా బాగుందనే చెప్పాలి.

సాంగ్ లో ప్రియదర్శి, రూప యమా స్టైలిష్ లుక్‌‌లో కనిపించి ఇంప్రెస్ చేశారు. లిరికల్ సాంగ్ మధ్యలో షూటింగ్ బిట్స్ ను కూడా యాడ్ చేశారు మేకర్స్. ఓవరాల్ గా సారంగపాణి ఫస్ట్ సాంగ్.. ఇప్పుడు నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది. అయితే కామెడీ జోనర్ లో రూపొందుతున్న సారంగపాణి మ్యూజిక్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ సంస్థ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ డీల్.. సాలిడ్ నంబర్స్ లో జరిగినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక సినిమా విషయానికొస్తే.. వెన్నెల కిషోర్, వీకే నరేష్, వైవా హర్ష ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల, శివన్నారాయణ ఇతర పాత్రల్లో సందడి చేయనున్నారు. పీజీ విందా, రవీందర్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఫుల్ లెంగ్త్ ప్రమోషన్స్ ను మేకర్స్ స్టార్ట్ చేయనున్నారట. మరి సారంగపాణి మూవీ ఎలాంటి హిట్ గా నిలుస్తుందో వేచి చూడాలి.

Full View
Tags:    
  • Sarangosarangalyrical 
  • Sarangapanijathakam 
  • Priyadarshi 
  • Roopakoduvayur 
  • Armaanmalik 
  • Viveksagar 
  • Sarangapanijathakammovie 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS