ట్రైలర్ టాక్: ఇదేమి హస్త ప్రయోగం కాదు..

ప్రియదర్శి హీరోగా, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్ గా విడుదలయ్యింది.;

Update: 2025-04-17 05:41 GMT

ఈ వేసవి కాలంలో కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సరికొత్త కామెడీ ఎంటర్టైనర్‌ను వెతుకుతున్న ప్రేక్షకులకోసం ‘సారంగపాణి జాతకం’ అనే కామెడీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రియదర్శి హీరోగా, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్ గా విడుదలయ్యింది. ఇక ఈ సినిమా పలు ఫన్నీ సీన్స్ తో ఫుల్ లెంగ్త్ ఫన్నీ ఎంటర్టైనర్ అని ఒక క్లారిటీ ఇచ్చేసింది.

ట్రైలర్ లో ముఖ్యంగా ప్రియదర్శి, వెన్నెల కిశోర్ మధ్య జరిగే సంభాషణలు కథకు బలంగా నిలుస్తున్నాయి. జాతకం, చేతిరేఖల విశ్లేషణ నుండి హత్యలపై కామెడీ సీన్స్ వరకు ఈ రెండు పాత్రధారులు తమ స్టైల్‌లో వినోదాన్ని అందిస్తున్నారు. రోపా కొడువయూర్ హీరోయిన్‌గా ఆకర్షణీయమైన పాత్రలో కనిపించారు. కామెడీ టైమింగ్‌లో ఎప్పుడూ మెప్పించే వైవా హర్ష కూడా తన కామెడీ పంచ్‌లతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ప్రియదర్శి పాత్ర ఓ చేతిరేఖలు నమ్మే వ్యక్తిగా కనిపించనుంది. అతడి నమ్మకాలు, ఆస్ట్రాలజీపై విశ్వాసాలు కథను భిన్న కోణంలో తీసుకెళ్తాయి. కామెడీ నేపథ్యంలో మర్డర్ మిస్టరీని కూడా మిక్స్ చేసి రూపొందించిన రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. హీరో జాతకం నుంచి జీవితాన్నే మార్చుకోవాలని చూసే కోసం రకరకాల పరిస్థితులకు దారి తీస్తున్నట్లు అర్ధమవుతుంది.

ట్రైలర్ చివర్లో హర్ష చెప్పే డైలాగ్ “ఇలాంటి వాళ్లను పెంచి పెద్దచేశావా?” అన్న తీరు ప్రేక్షకులను నవ్వించకుండా ఉండదు. అలాగే అన్ని నువ్వే చేసుకోవడానికి ఇదేమి హస్త ప్రయోగం కాదు.. హత్య ప్రయత్నం అంటూ వెన్నల కిషోర్ చెప్పిన విధానం కూడా మరింత హైలెట్ అయ్యింది. ఈ డైలాగ్‌తో ట్రైలర్ ముగియడం సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంది. ఇది ఓ క్లాస్, మాస్ అందరికీ నచ్చే కామెడీ అని చెప్పవచ్చు.

సారంగపాణి జాతకం ట్రైలర్ చూస్తుంటే.. కామెడీ, మిస్టరీ, చిన్నపాటి ఎమోషన్‌లతో కూడిన ఒక సున్నితమైన కుటుంబ కథ అనిపిస్తోంది. ప్రేక్షకులను హాయిగా నవ్వించే ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి మౌత్ పబ్లిసిటీ సంపాదించనుందని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్‌ను శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.థియేటర్ లో ఈ సినిమా ఎలాంటి బజ్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Full View
Tags:    

Similar News