• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజర్: ట్రాజెడి జాతకంలో...

టీజర్: ట్రాజెడి జాతకంలో సారంగపాణి అల్లరి

| ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

By - Tupaki Desk
Update: 2024-11-21 07:06 GMT

టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక మంచి కంటెను ఉన్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి మరో వినూత్నమైన సినిమాతో రాబోతున్నాడు. వీరి కలయికలో తెరకెక్కిన సరికొత్త చిత్రం 'సారంగపాణి జాతకం'. రూప కొడవయూర్ ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడీగా నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.


చిన్నప్పటి నుంచి చేతిలో రేఖలు, జీవితంలో జాతకాలు ప్రభావం ఉంటాయని నమ్మే వ్యక్తిబ ప్రియదర్శి ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. అతను చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక కచ్చితంగా జాతకం ఉంటుంది. గుడ్డిగా రాశిఫలాలు, జ్యోతీష్యం నమ్మి నిర్ణయాలు తీసుకునే వాడి లైఫ్ లో జాతకం తలక్రిందులైతే ఎలా ఉంటుందనే ఇంటరెస్టింగ్ పాయింట్ తో ఈ మూవీ కథని దర్శకుడు ఇంద్రగంటి చెప్పబోతున్నట్లు టీజర్ బట్టి తెలుస్తోంది.

ప్రస్తుత కాలంలో ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ నేచురల్ హాస్యంతో కథలు చెప్పే దర్శకులలో ఇంద్రగంటి మోహనకృష్ణ పేరు కచ్చితంగా ఉంటుంది. 'అష్టాచెమ్మా', 'అమీతుమీ' లాంటి సినిమాలతో అతను వినోదాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. మరోసారి ‘సారంగపాణి జాతకం’లో కూడా జ్యోతీష్యం నమ్మకాల నేపథ్యంలో కామెడీని జెనరేట్ చేస్తూ కథని చెప్పబోతున్నాడు.

జాతకాల ట్రాజెడిలో హీరో అల్లరి ఎట్రాక్ట్ చేస్తోంది. ఇందులో అవసరాల శ్రీనివాస్ ఓ ఇంటరెస్టింగ్ పాత్రలో కనిపించాడు. ఫుల్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోందని టీజర్ తో స్పష్టం అయ్యింది. ప్రియదర్శి కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. వెన్నెల కిషోర్ ఫుల్ కామెడీ జెనరేట్ చేసే క్యారెక్టర్ చేశాడు. కచ్చితంగా ఈ సినిమా కావాల్సినంత వినోదం అందించడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో 'సమ్మోహనం', 'జెంటిల్మెన్' సినిమాల తర్వాత ఇంద్రగంటి చేస్తోన్న మూడో సినిమా ఇది. వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాని డిసెంబర్ 20న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కచ్చితంగా ఈ మూవీ ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

ప్రియదర్శికి హీరోగా ఈ మూవీ బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ టీజర్ ని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను జ్యోతీష్యం, జాతకాలు నమ్మనని, కేవలం డెస్టినీని నమ్ముతానని అన్నారు. ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం గ్యారెంటీ అనే మాట టీజర్ చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.

Full View
Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • SarangapaniJathakam 
  • Teaser 
  • Teaserout 
  • Priyadharshi 
  • Roopakoduvayur 
  • VkNaresh 
  • Vennelakishore 
  • Mohanakrishnaindraganti 
  • Sivalenkakrishnaprasad 
  • Vijaydevarakonda 
  • Sridevimovies 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS