పంజా హీరోయిన్ బికినీ హొయ‌లు

మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం స్పీడ్ గా ఉండే సారా జేన్ తాజాగా బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ నుంచి అరుదైన ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది.;

Update: 2025-07-22 04:24 GMT

సారా జేన్ డ‌యాస్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ 'పంజా' చిత్రంలో ఈ భామ క‌థానాయిక‌గా న‌టించింది. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ సినిమా ఫ్లాప‌య్యాక అవ‌కాశాల కోసం చాలా ఇబ్బంది ప‌డింది. ఆ త‌ర్వాత సారా కోలీవుడ్‌లో న‌టించింది. అక్క‌డ అడ‌పాద‌డ‌పా విజ‌యాలు ద‌క్కినా కానీ, సుదీర్ఘ కెరీర్ ని సాగించేందుకు అవ‌స‌ర‌మైన ట్రాక్ ని నిర్మించుకోలేక‌పోయింది. స్టార్ డ‌మ్ అందుకునేంత‌ స్ట‌ఫ్ దొర‌క‌లేదు. న‌టిగా నిరూపించుకునేందుకు స‌రైన ఒక్క అవ‌కాశం కూడా రాలేదు.


అదే క్ర‌మంలో డిజిట‌ల్- వెబ్ సిరీస్ ప్ర‌పంచం సారా జేన్ డ‌యాస్ కి ఆయాచిత వ‌రంగా మారాయి. ఇప్ప‌టికే ప‌లు వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తూ సారా జేన్ నటిగా నిరూపించుకుంది. కొన్ని వెబ్ సిరీస్ ల‌లో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల‌తో ర‌క్తి క‌ట్టించింది. ఇప్పుడు నటుడు-ద‌ర్శ‌క‌నిర్మాత అన్షుమాన్ ఝా తెర‌కెక్కిస్తున్న సిరీస్ 'లక‌డ్‌బ‌ఘా 2 - ది మంకీ బిజినెస్' లో న‌టిస్తోంది. ఇది సీక్వెల్ క‌థ‌తో రూపొందుతున్న సిరీస్. ల‌క‌డ్ బ‌ఘా-1 పెద్ద స‌క్సెసైంది. భారతదేశపు మొట్టమొదటి జంతు ప్రేమికుల విజిలెంట్ యూనివర్స్ ని సృష్టించి దానితో ద‌ర్శ‌కుడు చాలా మ్యాజిక్ చేస్తున్నాడు. ఇలాంటి ఆస‌క్తిక‌ర కాన్పెస్ట్ ఉన్న సిరీస్ లో సారా జేన్ అవ‌కాశం అందుకోవ‌డాన్ని అదృష్టంగా భావిస్తోంది.

సారా ఇటీవ‌ల హార్డ్-హిట్టింగ్ స్పోర్ట్స్ డ్రామా 'ఇన్సైడ్ ఎడ్జ్', అంతర్జాతీయంగా పాపుల‌రైన 'యాంగ్రీ ఇండియన్ గాడెసెస్'ల‌లో న‌టించింది. ప్రపంచవ్యాప్తంగా అల‌రించిన‌ భారతదేశపు మొట్టమొదటి మహిళా బడ్డీ చిత్రంగా యాంగ్రీ ఇండియన్ గాడెసెస్ పాపుల‌రైంది.

జంతువులపై కరుణతో వ్య‌వ‌హ‌రించాల‌ని చెబుతూ ఒక కొత్త యాక్ష‌న్ ప్ర‌పంచాన్ని 'లక‌డ్‌బ‌ఘా 2 - ది మంకీ బిజినెస్' సిరీస్ కోసం ద‌ర్శ‌కుడు క్రియేట్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఇలాంటి క్రేజీ సిరీస్ లో సారా త‌న‌ను తాను మ‌రోసారి నిరూపించుకోనుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం స్పీడ్ గా ఉండే సారా జేన్ తాజాగా బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ నుంచి అరుదైన ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది. బికినీలో మంట‌లు పెడుతోందంటూ అభిమానులు ఈ ఫోటోగ్రాఫ్ పై కామెంట్లు చేస్తున్నారు. న‌టిగా పెరుగుతున్న గ్రాఫ్ ఇప్పుడు సారాకు టాలీవుడ్ లో అవ‌కాశాలు క‌ల్పిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News