బాలీవుడ్ హీరోయిన్‌కి తీసిపోని అందం ఆమె సొంతం
తన తల్లిదండ్రులు సచిన్ - అంజలి టెండూల్కర్‌తో కలిసి కనిపించిన సారా పొడవాటి నల్లటి మ్యాక్సీ డ్రెస్‌ను ధరించింది. సారా అందంగా నవ్వుతూ తన తండ్రి వెంటే కనిపించింది.;
సారా టెండూల్కర్ పరిచయం అవసరం లేదు. ఒక అందమైన బాలీవుడ్ హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోదు. కానీ బాలీవుడ్ లో మాత్రం అడుగుపెట్ట లేదు. జనవరి 5న రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ ఈవెంట్ ఆంటిలియాను సారా నిజంగా మరిగించింది.
నీతా అంబానీ నిర్వహించిన ఈవెనింగ్ పార్టీలో మేల్ ఫీమేల్ అంధుల క్రికెట్ జట్ల నుండి భారత ప్రపంచ కప్ ఛాంపియన్‌లను సత్కరించడానికి నిర్వహించిన కార్యక్రమమిది. ఓవైపు క్రీడాకారుల సందడి ఆకట్టుకుంటున్నా, రెడ్ కార్పెట్ వేదికపై సారా టెండూల్కర్, జాన్వి కపూర్ షో స్టాపర్స్ గా నిలిచారు.
జాన్వి కపూర్ ఎప్పటిలానే బోల్డ్ లుక్ తో కనిపించింది. మియు మియు నుండి అద్భుతమైన ఎరుపు పూల మినీ డ్రెస్‌ను జాన్వీ ధరించింది. జాన్వీ గ్లామ్ అండ్ స్టైల్ గురించి చాలా చర్చ సాగింది. కానీ సారా టెండూల్కర్ తక్కువ గ్లామర్ ఎలివేషన్ లోను ఎంతో అందంగా కనిపించింది. తన తల్లిదండ్రులు సచిన్ - అంజలి టెండూల్కర్‌తో కలిసి కనిపించిన సారా పొడవాటి నల్లటి మ్యాక్సీ డ్రెస్‌ను ధరించింది. సారా అందంగా నవ్వుతూ తన తండ్రి వెంటే కనిపించింది.
సినీపరిశ్రమలో సారా టెండూల్కర్ కి చాలామంది స్నేహితులు ఉన్నారు. వారితో కలిసి వాణిజ్య ప్రకటనల్లోను నటించింది. కానీ సారా ఎందుకనో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు. సారా తొందరలోనే వెండితెర ఆరంగేట్రం చేస్తుందని అభిమానులు సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.