పిజ్జాలు-బ్రౌనీలు అన్‌లిమిటెడ్‌గా తిని 100కేజీలు పెరిగిన స్టార్ కిడ్!
బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ తన అద్భుతమైన ఫిట్‌నెస్- క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి ఎంతో పాపులరయ్యారు.
బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ తన అద్భుతమైన ఫిట్‌నెస్- క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి ఎంతో పాపులరయ్యారు. అయితే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందు న్యూయార్క్‌లో చదువుకునే రోజులలో తనకు ఉన్న చెడ్డ ఆహారపు అలవాట్ల గురించి తాజాగా సారా వెల్లడించారు.
ఆ కాలంలో తన జీవితం కేవలం పిజ్జాలు, చాక్లెట్ బ్రౌనీల చుట్టూనే తిరిగేదని... తాను ఎలాంటి ఆలోచన లేకుండా విపరీతంగా తినే మైండ్ లెస్ ఈటింగ్ హ్యాబిట్ ఒక భయంకరమైన దశను దాటిపోయిందని ఓపెన్‌గా అంగీకరించారు. కేదార్‌నాథ్ సినిమాతో వెండితెరకు పరిచయం కావడానికి ముందు తనలో వచ్చిన భారీ శారీరక మార్పుకు దారితీసిన పరిస్థితులను `కర్లీ టేల్స్`కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సరదాగా రివీల్ చేసారు.
న్యూయార్క్‌లో విద్యార్థినిగా ఉన్న సమయంలో తాను ఆరోగ్యకరమైన పోషకాహారం కంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదాన్నని సారా అలీ ఖాన్ గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో అక్కడ ఒక లార్జ్ పిజ్జా కొనడం కంటే రెండు మీడియం పిజ్జాలు కొనడం చౌకగా ఉండేదని.. ఒక మీడియం పిజ్జా కొంటే రెండో దానిపై 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉండేదని తెలిపారు. ఆ ఆఫర్ చూసి ప్రతిరోజూ రెండు మీడియం పిజ్జాలను ఆర్డర్ చేయడం తెలివైన పని అనుకునేదాన్ని. కానీ ఆ ఆఫర్ వల్ల నా బరువు కూడా మరో 50 శాతం పెరుగుతుందనే విషయం అప్పుడు గ్రహించలేదు. ఆ సమయంలో నేను లెక్కలు సరిగా వేయలేకపోయాను! అంటూ సారా జోక్ చేశారు.
కేవలం పిజ్జాలు మాత్రమే కాకుండా కాలేజీ రోజుల్లోని బ్రేక్‌ఫాస్ట్ కూడా ఎంతో విచిత్రంగా ఉండేదని సారా అలీ ఖాన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం ఏకంగా మూడు చాక్లెట్ చిప్ బ్రౌనీలను తినడం తనకు అలవాటని చెప్పారు. నా కెఫెటేరియా నుండి క్లాస్‌రూమ్‌కు వెళ్లడానికి కేవలం 5 నిమిషాల సమయం పట్టేది. నేను ఒక 7 నిమిషాల పాటు నడుస్తూ ఆ మూడు బ్రౌనీలను తినేసేదాన్ని.. నేను జోక్ చేయడం లేదు! అని సారా పేర్కొన్నారు. వెనక్కి తిరిగి చూసుకుంటే తాను ఏం తింటున్నాను.. ఎంత పరిమాణంలో తింటున్నాను అనే స్పృహ లేకుండా కేవలం నోటికి నచ్చింది తినేసేదాన్నని సారా అంగీకరించారు.
సినిమాల్లోకి ప్రవేశించాలనే బలమైన నిర్ణయంతో సారా అలీ ఖాన్ తన జీవనశైలిని పూర్తిగా మార్చేసుకున్నారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన `కేదార్‌నాథ్` చిత్రం ద్వారా బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి ముందే నిరంతర వర్కవుట్లు, కఠినమైన డైట్ నియమాలు.. అత్యంత క్రమశిక్షణతో కూడిన పద్ధతుల ద్వారా ఏకంగా 45 కిలోల బరువు తగ్గడం విశేషం. ఒకప్పుడు ఊబకాయంతో బాధపడిన సారా తన పట్టుదలతో ఈ స్థాయి శారీరక మార్పును సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
గత కొన్నేళ్లుగా సారా అలీ ఖాన్ ఆహారం, వ్యాయామం, కట్టుబాటుపై తనకున్న అభిప్రాయాలను పలు వేదికలపై షేర్ చేస్తూనే ఉన్నారు. బాలీవుడ్‌లో గొప్ప ఫాలోయింగ్ ఉన్న ఫిట్‌నెస్ స్టార్లలో ఒకరిగా మారకముందు ఒక సాధారణ అమ్మాయిలా తనుచేసిన పొరపాట్లను.. ఎదుర్కొన్న ఇబ్బందులను సారా ఓపెన్ గా మాట్లాడటం నిజంగా గ్రేట్. సారా అలీఖాన్ 100 కేజీల బరువు నుంచి దాదాపు 45 కేజీలు తగ్గి 55 -60 కేజీల రేంజుకు రావడం నిజంగా గ్రేట్.