• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సప్త సాగరాలు నెలలోపే OTT...

సప్త సాగరాలు నెలలోపే OTT రిలీజ్..!

| కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి హేమంత్ ఎం రావు కాంబినేషన్ లో వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా మొదటి పార్ట్ అదే సైడ్ A సెప్టెంబర్ 1న రిలీజ్ చేయగా రెండు వారాల తర్వాత తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు.

By - Tupaki Desk
Update: 2023-12-06 10:15 GMT

కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి హేమంత్ ఎం రావు కాంబినేషన్ లో వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా మొదటి పార్ట్ అదే సైడ్ A సెప్టెంబర్ 1న రిలీజ్ చేయగా రెండు వారాల తర్వాత తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో సైడ్ A కి రెస్పాన్స్ పర్వాలేదు అన్నట్టుగా రాగా సైడ్ Bని నవంబర్ 17న కన్నడ వెర్షన్ తో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ చేశారు. సైడ్ A కన్నా సైడ్ B లో ఎక్కువ కథ ఉన్నా ఆడియన్స్ ఎందుకో సైడ్ Bని లైట్ తీసుకున్నారు. రక్షిత్ శెట్టి అండ్ టీం ఎంత ప్రమోట్ చేసినా సప్త సాగరాలు దాటి సైడ్ Bని ఆడియన్స్ పట్టించుకోలేదు.

థియేట్రికల్ రిలీజ్ ఆశించిన స్థాయిలో ఆడకపోతే ఆ సినిమాను త్వరగానే ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. డిజిటల్ రైట్స్ భారీగా కొనేసిన ఓటీటీ సంస్థలు థియేట్రికల్ రన్ పూర్తి కాకముందే సినిమాను డిజిటల్ రిలీజ్ చేస్తాయి. ఇక వెండితెర మీద పెద్దగా ఆడని సినిమాలకు ఇంకాస్త ముందుగా ఓటీటీ రిలీజ్ చేస్తారు. ఈ క్రమంలో సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమాను కూడా నెల లోపే ఓటీటీలోకి తెస్తున్నారు.

డిసెంబర్ 15న అమేజాన్ ప్రైమ్ వీడియోలో సప్త సాగరాలు దాటి సైడ్ B ఓటీటీ రిలీజ్ అవుతుంది. కన్నడ, తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది. రక్షిత్ శెట్టి రుక్మిణి వసంత్, చైత్ర ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమా సైడ్ ఏ ఆకట్టుకున్న రేంజ్ లో సైడ్ B అలరించలేకపోయింది.

సప్త సాగరాలు దాటి సైడ్ A ప్రైమ్ వీడియోలో కూడా మంచి వ్యూయర్షిప్ సాధించింది. ఎలాగు ఓటీటీ లో రిలీజ్ అవుతుంది అనుకుని సినిమాను థియేట్రికల్ వెర్షన్ స్కిప్ చేసిన వారు ఉండొచ్చు. మరి సైడ్ B ఓటీటీ ఆడియన్స్ ని అయినా మెప్పించేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఒక కమర్షియల్ సినిమాను రెండు భాగాలుగా తీయడం చూశాం కానీ లవ్ స్టోరీని ఇలా రెండు భాగాలుగా చెప్పాలని ప్రయత్నించడం మంచి విషయం. కన్నడలో సైడ్ B కూడా వర్క్ అవుట్ అయినా మన దగ్గర మాత్రం కేవలం విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు

Tags:    
  • Sapthasagarallu 
  • Ralshitshetty 
  • Hemanthmrao 
  • Kannada 
  • Filmindustry 
  • Ott 
  • Amazonprimevideo 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS