డీడీ నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంది..?

ఈ సినిమా మే నెలలోనే తమిళ్ లో థియేట్రికల్ రిలీజై మెప్పించగా లేటెస్ట్ గా ఓటీటీలో అన్ని భాషల్లోకి అందుబాటులో వచ్చింది.;

Update: 2025-06-13 16:54 GMT

కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం కూడా ఎప్పుడు కమెడియన్ రోల్స్ ఎందుకు తను కూడా లీడ్ రోల్స్ చేస్తే బెటర్ కదా అని కమెడియన్ గా సైడ్ రోల్స్ మానేసి లీడ్ రోల్స్ లో సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ఐతే హీరోగా మారాం కదా అని ఫైట్లు, యాక్షన్లు కాకుండా తన బలమైన కామెడీనే నమ్ముకున్నాడు సంతానం. అదే అతనికి సక్సెస్ లు తెచ్చి పెడుతుంది. ఇప్పటికే సోలోగా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్న సంతానం లేటెస్ట్ గా డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా మే నెలలోనే తమిళ్ లో థియేట్రికల్ రిలీజై మెప్పించగా లేటెస్ట్ గా ఓటీటీలో అన్ని భాషల్లోకి అందుబాటులో వచ్చింది. దిల్లుకు దుడ్డు సినిమాకు ఫ్రాంచైజీలుగా ఈ సినిమాలు వస్తున్నాయి. దిల్లుకు దుడ్డు,దిల్లుకు దుడ్డు 2, డీడీ రిటర్న్స్ ఇలా వరుస సినిమాలు చేయగా ఇప్పుడు డీడీ నెక్స్ట్ లెవెల్ అని వచ్చాడు సంతానం.

ఇంతకీ అసలు ఈ సినిమా కథ ఏంటంటే.. కృష్ణమూర్తి అతన్నే కిస్సా (సంతానం) అని పిలుస్తారు. ఒక యూట్యూబర్. సినిమాలు రివ్యూస్ ఇస్తూ జీవితం సాగిస్తుంటాడు. ఐతే ఓసారి అతను డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా స్క్రీనింగ్ కి ఫ్యామిలీతో కలిసి ఇన్విటేషన్ అందుకుంటాడు. ఐతే అది దెయ్యాల థియేటర్ అని తెలిసి కిస్సా ఇంటికి రాగా ఆల్రెడీ ఫ్యామిలీ అంతా ఆ థియేటర్ కి వెళ్తారు. ఐతే సినిమాలో పాత్రల్లానే తన ఫ్యామిలీ మెంబర్స్ ప్రవర్తిస్తుంటారు. వాళ్లను ఆ పాత్రల నుంచి ఎలా బయట పెట్టాడు.. అసలు ఆ థియేటర్ అలా ఎందుకు ఉంది.. కిస్సా ఫ్యామిలీని ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయట పడేశాడు అన్నది సినిమా కథ.

సంతానం సినిమాలో ఉండాల్సిన కామెడీ ఇందులో ఉంది కానీ సందర్బోచితంగా వచ్చిన కామెడీ ఇంప్రెస్ చేసినా సంతానం పంచులు అంత గొప్పగా ఏమి లేవు. ఇక సినిమా మొత్తం తన ఫ్యామిలీ ఆ సినిమాల్లో పాత్రల నుంచి బయట పడేలా చేయడమే చూపించారు. సినిమా కామెడీతో మొదలై హారర్ జోనర్ లోకి వెళ్తుంది. సినిమా అంతా సరదాగా అనిపించినా మరీ అంతగా నవ్వులు పంచలేదు. ఐతే సంతానం అండ్ టీం చేసిన ప్రయత్నానికి ఓటీటీ ఆడియన్స్ అయితే ఒకసారి చూసే అవకాశం ఉంటుంది. ఈ సినిమాను ప్రేమ్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. సినిమాలో గీతిక తివారి, గౌతమ్ మీనన్, సెల్వ రాఘవన్ నటించారు.

Tags:    

Similar News