సంక్రాంతి చిత్రాలు.. ఒక్కొక్కటి ఒక్కో అంచనాతో..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ అంటే కేవలం పండగ మాత్రమే కాదు.. బాక్సాఫీస్ కు అసలైన పరీక్ష.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ అంటే కేవలం పండగ మాత్రమే కాదు.. బాక్సాఫీస్ కు అసలైన పరీక్ష. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు భారీగా తరలివచ్చే ఆ సమయంలో విడుదలయ్యే సినిమాలపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. 2026 సంక్రాంతికి ఇప్పటికే ఐదు తెలుగు స్ట్రయిట్ మూవీస్ చిత్రాలు బరిలో నిలవగా, వాటికి నెటిజన్లు పెట్టిన ఐదు క్యాప్షన్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆ సంగతులేంటో చూద్దాం.
ప్రభాస్ రాజా సాబ్ ఇలా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సంక్రాంతికి రాబోతున్న అత్యంత ఇంట్రెస్టింగ్ మూవీ. హారర్ కామెడీ జానర్ లో రూపొందిన ఆ సినిమా ప్రభాస్ కెరీర్ లో ఒక ప్రయోగం. ఇప్పటివరకు భారీ యాక్షన్, పీరియాడిక్ సినిమాల్లో కనిపించిన ప్రభాస్, ఈసారి భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. అందుకే నెటిజన్లంతా ప్రయోగమని అంటున్నారు.
అనగనగా ఒక రాజు
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా చూడలేదు. ప్రతి సినిమాతో తన మార్కెట్ పెంచుకుంటూ వస్తున్న నవీన్, అనగనగా ఒక రాజుతో సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ఫ్లాప్స్ లేకుండా దూకుడుతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అదే నెటిజన్లు అంటున్నారు. అదే దూకుడు కంటిన్యూ అయ్యి సినిమా హిట్ అయితే నవీన్ సక్సెస్ ట్రాక్ మరింత స్ట్రాంగ్ అవుతుంది.
మన శంకర వర ప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని రూపొందింది. చిరంజీవి ఫేమ్, సంక్రాంతి సీజన్, ఫ్యామిలీ స్టోరీతో సినిమా క్లిక్ అయ్యేలా కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ దక్కితే దూసుకుపోతుంది. దీంతో ఆ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ అనే క్యాప్షన్ కచ్చితంగా సరిపోతుంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తితో ఆశలు
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఆయనకు చాలా కీలకం. గత కొంతకాలంగా హిట్స్ సొంతం కాకపోవడంతో రవితేజ కమ్ బ్యాక్ మూవీగా అభిమానులు భావిస్తున్నారు. మంచి కంటెంట్ ఉంటే మళ్లీ పాత ఫామ్ లోకి రావచ్చన్న నమ్మకం అందరిలో ఉంది. అందుకే సినిమాకు కమ్ బ్యాక్ మూవీ అనే క్యాప్షన్ వినిపిస్తోంది.
నారీ నారీ నడుమ మురారి కూడా
మరో కమ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలుస్తున్న చిత్రం శర్వానంద్ నటిస్తున్న నారీ నడుమ మురారి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో కూడిన కథతో తెరకెక్కుతున్న ఆ సినిమా, శర్వా కెరీర్ కు మళ్లీ ఊపునివ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి ప్రయోగం, సక్సెస్ ట్రాక్, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్, కమ్ బ్యాక్ ఆశలు.. ఇలా ఐదు సినిమాలు ఐదు రకాల అంచనాలతో 2026 సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. చివరకు ఏ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.