• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతికి వస్తున్నాం...

సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్.. లెక్క అస్సలు తగ్గట్లేదుగా..

| సినిమా మొదటి రోజే థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనబడగా, పండుగ ముగిసిన తర్వాత కూడా కలెక్షన్ల పట్ల అంచనాలు తగ్గలేదు.

By - Tupaki Desk
Update: 2025-01-25 09:18 GMT

ఈ ఏడాది సంక్రాంతి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చింది విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా. భారీ అంచనాల నడుమ జనవరి 14న థియేటర్లలో అడుగు పెట్టిన ఈ సినిమా, పండుగ సీజన్‌కి సరిగ్గా సరిపోయేలా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. కామెడీ, క్రైమ్ డ్రామా, మాస్ యాక్షన్ అన్నీ కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

సినిమా మొదటి రోజే థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనబడగా, పండుగ ముగిసిన తర్వాత కూడా కలెక్షన్ల పట్ల అంచనాలు తగ్గలేదు. 10 రోజుల తరువాత కూడా వర్కింగ్ డేస్‌లో సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ రావడం విశేషం. బుక్ మై షో డేటా ప్రకారం, గడచిన 24 గంటల్లోనే లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ముఖ్యంగా శుక్రవారం నాడు ఈ రేంజ్ రిపోర్ట్ రావడం ట్రేడ్ వర్గాల్లో ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్‌ను దాటేసింది. సినిమా విజయవంతంగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించడంతో నిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వారం చివర్లో అంటే శని, ఆదివారాల్లో మరింత స్ట్రాంగ్ రిపోర్ట్ ఉండే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ ఎనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. సినిమా బజ్ చూస్తుంటే 300 కోట్ల గ్రాస్ మార్క్ చేరడం పెద్ద సమస్య కాదని అంటున్నారు.

అంతే కాదు, ఈ చిత్రం అమెరికాలో కూడా బాగా రన్ అవుతోంది. ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇది వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. భారీ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను తీర్చిదిద్దడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాపై మక్కువ చూపుతున్నారు.

ఈ సినిమా విజయవంతం కావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ స్క్రీన్‌ప్లే. అలాగే వెంకటేష్ నటన అని చెప్పొచ్చు. వినోదం, యాక్షన్, సెంటిమెంట్‌ను సమర్థవంతంగా బ్యాలెన్స్ చేయడం, మల్టీ జనరేషనల్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఈ వసూళ్లను చూస్తుంటే ప్రేక్షకులకు ఇంకా ఎంతగా ఈ సినిమా కనెక్ట్ అయిందో చెప్పడానికి ప్రత్యేకంగా ఆలోచించనవసరం లేదు. సంక్రాంతి తర్వాత కూడా సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ఉన్న బజ్ చూస్తే, ఇది కచ్చితంగా 2025 బెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయం. 300 కోట్ల క్లబ్‌లో చేరి మరో మెమోరబుల్ రికార్డ్ క్రియేట్ చేయడం పెద్ద ఆశ్చర్యం కాదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

#SankranthikiVasthunam continues its box office success, with the film registering a massive sale of 106.1K tickets in the last 24 hours.

The film has already grossed over 230 crore and is rapidly approaching 250 crore worldwide. It has earned more than $2.5 million in North… pic.twitter.com/mhnZ2KhR78

— Tupaki (@tupaki_official) January 25, 2025
Tags:    
  • Sankranthikivastunnam 
  • Sankranthikivastunnamcollections 
  • Venkatesh 
  • Anilravipudi 
  • Meenakshichaudhary 
  • Aishwaryarajesh 
  • Dilraju 
  • Sankranthikivastunnamboxoffice 
  • Bookmyshow 
  • Tollywood 
  • Bulliraju 
  • Filmindustry 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS