• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూప‌ర్‌స్టార్‌తో స్టార్‌...

సూప‌ర్‌స్టార్‌తో స్టార్‌ డైరెక్ట‌ర్ గొడ‌వ‌లు నిజ‌మా?

| ఇటీవలి ఇంటర్వ్యూలో ద‌ర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ప్ర‌శ్నించ‌గా.. ఈ ప్రచారం గురించి ప్ర‌స్థావించారు.

By - Tupaki Desk
Update: 2024-05-26 16:30 GMT

దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భ‌న్సాలీ, కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ మధ్య గొడవలున్నాయని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలి ఇంటర్వ్యూలో ద‌ర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ప్ర‌శ్నించ‌గా.. ఈ ప్రచారం గురించి ప్ర‌స్థావించారు.

అయితే స‌ల్మాన్ తో త‌న రిలేష‌న్ గురించి భ‌న్సాలీ చెప్పిన విష‌యాలు షాక్ కి గురి చేసాయి. త‌మ మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన సంబంధాలు ఉన్నాయ‌ని, ఎటువంటి ఘర్షణ లేద‌ని ఆ వార్త‌ల్ని పూర్తిగా ఖండించారు. తామిరువురం తరచూ టెలిఫోనిక్ సంభాషణలలో పాల్గొంటామ‌ని, సల్మాన్ తన ఆరోగ్యం గురించి ఆరా తీసేందుకు నిరంత‌రం కాల్ చేస్తుంటారని వెల్లడించారు.

సల్మాన్ - సంజయ్ 'ఇన్షా అల్లా' చిత్రం కోసం క‌లిసి ప‌ని చేయాల‌నుకున్నారు. కానీ అది ఆలస్యం అయింది. సల్మాన్‌తో భ‌న్సాలీకి క‌ల‌త‌లు వచ్చాయ‌ని, అందుకే ఆ చిత్రం ప‌ట్టాలెక్క‌లేద‌ని ప్ర‌చారమైంది. కానీ ఆ పుకార్లను ఇప్పుడు ఇంట‌ర్వ్యూలో భ‌న్సాలీ తోసిపుచ్చాడు. సినిమాల‌తో సంబంధం లేకుండా త‌మ మ‌ధ్య మంచి రిలేష‌న్ షిప్ ఉంద‌ని భ‌న్సాలీ తెలిపారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారు ఫుల్ బిజీ. స‌ల్మాన్ త‌దుప‌రి మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సికంద‌ర్ చిత్రంలో న‌టిస్తున్నారు. దర్శకుడు సంజయ్ లీలా భ‌న్సాలీ మొట్టమొదటి వెబ్ సిరీస్ 'హీరామండి: ది డైమండ్ బజార్' ని తెర‌కెక్కించి మే 1 న విడుదల చేసారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం అవుతోంది. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, అలియా భట్ ల‌తో 'లవ్ అండ్ వార్' చిత్రం కోసం త‌దుప‌రి భ‌న్సాలీ ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు.

సంజయ్ లీలా భన్సాలీ గతంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి 'హమ్ దిల్ దే చుకే సనమ్' చిత్రం కోసం ప‌ని చేసారు. స‌ల్మాన్ మాజీ ప్రియురాలు ఐశ్వర్యరాయ్ ఇందులో క‌థానాయిక‌గా నటించారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా విభేధాల స‌మ‌యంలో భ‌న్సాలీ కూడా కొంత మ‌నోవేద‌న అనుభ‌వించాల్సి వ‌చ్చింద‌ని టాక్ వినిపించింది.

Tags:    
  • Sanjayleelabhansali 
  • Salmankhan 
  • Murgadass 
  • Sikander 
  • Heeramandi 
  • HumDilDeChukeSanam 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS