రియలిజానికి భన్సాలీ మార్క్ గ్రాండియర్ తోడైతే?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత వైభవంగా, విజువల్ గ్రాండ్‌నెస్‌తో చారిత్రాత్మక చిత్రాలను తెరకెక్కించే దిగ్గజ ద‌ర్శ‌క‌, నిర్మాత‌ సంజయ్ లీలా భన్సాలీ.

Update: 2026-09-02 05:57 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత వైభవంగా, విజువల్ గ్రాండ్‌నెస్‌తో చారిత్రాత్మక చిత్రాలను తెరకెక్కించే దిగ్గజ ద‌ర్శ‌క‌, నిర్మాత‌ సంజయ్ లీలా భన్సాలీ. ఆయన నిర్మాణ సంస్థ `భన్సాలీ ప్రొడక్షన్స్` పతాకంపై రూపొందే ప్రతి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలుంటాయి. ప్రస్తుతం భ‌న్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న `లవ్ అండ్ వార్` చిత్రం తుదిదశకు చేరుకుంది. దీంతో భ‌న్సాలీ నిర్మాణ సంస్థ ప‌నుల్ని ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా సొంత నిర్మాణ భాగస్వామ్యంలో మరో భారీ హిస్టారికల్ ఎపిక్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సంచలన ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించే బాధ్యతను డిజిటల్ స్పేస్‌లో `గ్రహణ్` సిరీస్‌తో ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు రంజన్ చందేల్ కు అప్పగించడం విశేషం. యథార్థ సంఘటనలు, నేర పరిశోధనలు, సమాజానికి సంబంధించిన భావోద్వేగాలను అత్యంత సహజంగా తెరకెక్కించే రంజన్ చందేల్ మార్క్ స్టోరీ టెల్లింగ్‌ను భన్సాలీకి ఉండే లార్జర్ ద్యాన్ లైఫ్ విజువల్ స్కేల్‌తో జోడించడం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ కానుంది. అయితే ఈ చారిత్రక కథాంశం అప్ప‌టిక‌ప్పుడు అనుకున్న‌ది కాదు .

దీని వెనుక కొంత కాలంగా బ‌న్సా లీ అండ్ కో వ‌ర్క్ చేస్తోంది. దాదాపు ఏడాది కాలంగా రంజన్ చందేల్ - భన్సాలీలు సంయుక్తంగా కథా చర్చలు జరిపారు. తాజాగా పక్కాగా స్క్రిప్ట్‌ సిద్ధం అయిన నేప‌థ్యంలోనే అధికారిక వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. స్క్రిప్ట్ పనులు పూర్త‌వ్వ‌డంతో త్వరలోనే భారీ ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. రంజన్ చందేల్‌కు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అనురాగ్ కశ్యప్ రూపొందించిన `రామన్ రాఘవ్ 2.0`, `ముక్కాబాజ్` చిత్రాలకు సహ-రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రంజ‌న్ `బామ్‌ఫాడ్` తో దర్శకుడిగా మారారు.

అటుపై 1984 సిక్కుల అల్లర్ల నేపథ్యంతో `గ్రహణ్` సిరీస్ తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్నారు. ప్రస్తుతం రంజ‌న్ చందేల్ `రంగబాజ్ సీజన్ 4` వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే భన్సాలీ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నారు. సోర్సెన్ నుంచి అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం భారీ హిస్టారికల్ ఎపిక్ ప్రాజెక్ట్‌ను 2027 ప్ర‌ధ‌మార్దంలో సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. షూటింగ్ కూడా ఏడాదికిపైగానే జ‌రిగే అవ‌కాశం ఉందంటున్నారు. అంత‌కు ముందు చేప‌ట్టే న‌టీన‌టుల ఎంపిక కూడా అంత సుల‌భంగా తేలే అంశం కాదు. భ‌న్సాలీ ప్రొడ‌క్ష‌న్ లో సినిమా అంటే బోలెడంత గ్రౌండ్ వ‌ర్క్ జ‌రుగుతుంది. న‌టీన‌టులంతా ఆయా పాత్ర‌ల‌కు ప‌క్కాగా యాప్ట్ అవుతారంటేనే ప‌ట్టాలెక్కుతుంది. అటుపై న‌టీనటుల‌కు వ‌ర్క్ షాప్స్ నిర్వ‌హిస్తారు. ఈ ప్రోస‌స్ కే ఆరు నెల‌ల వ‌ర‌కూ స‌మ‌యం ప‌డుతుంది.

Tags:    

Similar News