డిప్ప‌మీద లాగి సెల్పీ ఇచ్చిన స్టార్!

తాజాగా సంజ‌య్ ద‌త్ అభిమాని డిప్ప మీద ఒక‌టి లాగి మ‌రీ సెల్పీ ఇచ్చారు. ఓ సాయంత్రం పూట రోడ్డు ప‌క్క‌నే ఉన్న రెస్టారెంట్ లోకి వెళ్ల‌డానికి సంజ‌య్ ద‌త్ నిల‌బ‌డి ఉన్నారు.;

Update: 2025-08-23 08:32 GMT

అభిమానులన్నాక హీరోల‌పై ఎగ‌బ‌డ‌కుండా ఉంటారా? హీరోలు సెల్పీలు ఇవ్వ‌కుండా ఉంటారా? హీరోలు సీరియ‌స్ అయినా? చీవాట్లు పెట్టినా? స్మార్ట్ ఫోన్లు నేల‌కేసి కొట్టినా? సెల్పీ దిగి రానిదే మ‌న‌సు ఊరుకోదు. అవ‌స‌ర‌మైతే దెబ్బ‌లైనా తింటాం? అదే మా అభిమానం ప్ర‌త్యేక‌త అని ఎప్ప‌టిక‌ప్పుడూ అభిమానుల విష యంలో ప్రూవ్ అవుతూనే ఉంటుంది. తాజాగా సంజ‌య్ ద‌త్ అభిమాని డిప్ప మీద ఒక‌టి లాగి మ‌రీ సెల్పీ ఇచ్చారు. ఓ సాయంత్రం పూట రోడ్డు ప‌క్క‌నే ఉన్న రెస్టారెంట్ లోకి వెళ్ల‌డానికి సంజ‌య్ ద‌త్ నిల‌బ‌డి ఉన్నారు.

లోప‌ల‌కి వెళ్ల‌బోయారు. ఇంత‌లో ఓ అభిమాని చేతిలో పోన్ ప‌ట్టుకుని సెల్పీ ప్లీజ్ అంటూ ముందుకు దూసు కొచ్చాడు. వెంట‌నే సంజ‌య్ ద‌త్ ఆ కుర్రాడి వైపు ఓ లుక్ ఇచ్చి రా ప‌క్క‌కు అని సిగ్నెల్ పాస్ చేసారు. కానీ ముందుకొచ్చాక కెమెరా ఆన్ కాలేదు. దీంతో స‌రిగ్గా న‌డి నెత్తిమీద ఓ డిప్ప కాయ‌లాగి సెల్పీ ఇచ్చారు. దీంతో ప‌క్క‌నే ఉన్న‌వారంతా ఒక్క‌సారిగా ఘ‌ల్లున న‌వ్వారు. ఇది ఎంతో ప‌న్నీ మూవ్ మెంట్. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. చాలా మంది హీరోలు సెల్పీలు అంటే సీరియ‌స్ అవుతారు.

కానీ సంజ‌య్ ద‌త్ మాత్రం సీరియ‌స్ అవ్వ‌కుండా అక్క‌డో స‌ర‌దా వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేసారు. ద‌త్ తో సెల్పీ అంటే ఆ మాత్రం ఫ‌న్ లేక‌పోతే ఎలా? ఇక న‌టుడిగా? సంజ‌య్ ద‌త్ బిజీగా ఉన్న సంగ‌తి తెలి సిందే. తెలుగు, హిందీ సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా పాన్ న‌టిస్తోన్న `అఖండ 2` లో విల‌న్ గా న‌టిస్తున్నారు. ఇది పాన్ ఇండియా రిలీజ్ చిత్రం.

ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇందులో బాల‌య్య‌- సంజ‌య్ ద‌త్ మ‌ధ్య యాక్ష‌న్ స‌న్ని వేశాలు పీక్స్ లో ఉంటాయ‌ని అంచ‌నాలున్నాయి. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా తెర‌కె క్కుతోన్న `ది రాజాసాబ్` లోనూ ప్ర‌తి నాయ‌కుడి పాత్ర పోషిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో `బాఘీ -4`, `దురంధ‌ర్` లో న‌టిస్తున్నారు. వీటితో పాటు ఓ రెండు పంజాబీ చిత్రాల్లోనూ న‌టిస్తున్నారు. ఈ చిత్రాల‌న్నీ ఇదే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

Full View
Tags:    

Similar News