తిండి లేక సన్నగా అయిపోయిన నటుడు!
సంగీత్ శోభన్ ఇప్పుడు పరిచయం అవసరం లేని పేరు. `మ్యాడ్`, `మ్యాడ్ స్క్వేర్` విజయాలతో టాలీవుడ్ లో వెల్ నోన్ గా మారిపోయాడు.;
సంగీత్ శోభన్ ఇప్పుడు పరిచయం అవసరం లేని పేరు. `మ్యాడ్`, `మ్యాడ్ స్క్వేర్` విజయాలతో టాలీవుడ్ లో వెల్ నోన్ గా మారిపోయాడు. సోలోగానూ ఇప్పుడు అవకాశాలు అందుకుంటున్నాడు. భవిష్యత్ లో మంచి స్టార్ గా ఎదుగుతాడు? అన్న నమ్మకం వ్యక్తమవుతుంది. అల్లరి నరేష్ ని రీప్లేస్ చేస్తాడు? అన్న అంచ నాలున్నాయి. ఇప్పటికే హీరోగా నిహారిక కొణిదెల ఓ చిత్రాన్ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
సంగీత్ శోభన్ అంటే బాల నటుడు అని కొందరికే తెలుసు. `గోల్కొండ హైస్కూల్` లో స్కూల్ విద్యార్ధి పాత్రలో నటించాడు. అందులో బొద్దుగా ఉంటాడు. పిట్ట చిన్నదైనా కూత ఘనం అయిన మాదిరి సినిమాలో పాత్ర యాటిట్యూడ్ తో బాగానే కనిపిస్తాడు. అందులో సంగీత్ ని చూసి...ఇప్పుడు సంగీత్ ని చూస్తే అతడు ఇతడేనా? అన్న డౌట్ రావడం సహజం. సహజంగా వయసు పెరిగే కొద్ది మార్పులొస్తాయి.
కానీ సంగీత్ లో మార్పులు మాత్రం ఏమాత్రం నమ్మశక్యంగా రాలేదు. చిన్నప్పటి పోలిక ఒక్కటి కూడా ఇప్పుడు ఎక్కడా కనిపించడదు. మరి ఇంత సన్నగా సంగీత్ ఎలా మారాడు? సినిమాల కోసం మారాడా? అంటే అంత సీన్ లేదంటున్నాడు సంగీత్. తాను చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకూ కూడా అదే లావుతో ఉండే వాడినన్నాడు. ఇంటర్మీడియట్ తర్వాత కర్ణాటక మణిపాల్ యూనివర్శీటీలో చదువు కోసం వెళ్లడంతో రూపం మారిపోయిందంటున్నాడు.
కర్ణాటకలో సరైన పుడ్ పుడ్ దొరకకపోవడం.. ట్రావెలింగ్ సదుపాయం లేకపోవడంతో ఎక్కడికైనా నడిచే వెళ్లడం వంటివి చేయడంతో సహజంగానే ఉన్న బరువంతా కోల్పోయినట్లు తెలిపాడు. అంతకు మించి బరువు తగ్గడం కోసం తాను ప్రత్యేకంగా ఎలాంటి డైట్లు పాటించలేదన్నాడు. నటుడు అవుదాం అనుకున్న సమయంలో? చిన్నపాటి మార్పులు మాత్రమే చేసానంటున్నాడు.