కళ్లు చూసి ఎగతాళి చేశారు.. కానీ ఇప్పుడు..
మనిషి అన్న తర్వాత లోపాలు సహజం. అయితే కొన్ని లోపాలకు భగవంతుడు పుట్టుకతోనే ఇస్తే మరికొన్ని మాత్రం మనం చేతులారా చేసుకుంటే వస్తాయి.;
మనిషి అన్న తర్వాత లోపాలు సహజం. అయితే కొన్ని లోపాలకు భగవంతుడు పుట్టుకతోనే ఇస్తే మరికొన్ని మాత్రం మనం చేతులారా చేసుకుంటే వస్తాయి. ఆ లోపాలను చూసి కొందరు ఎగతాళి చేస్తూ ఉంటారు. ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ గా పేరు సంపాదించుకున్న శాండీ మాస్టర్ ను కూడా అలానే గేలి చేశారట. తన కళ్లను చూసి డెత్ గోట్ ఐస్ అంటూ ఏడిపించేవారని చెప్పారు శాండీ.
కళ్లను చూసి ఏడిపించారు
లియో, లోక, తాజాగా కిష్కింధపురి సినిమాల్లో విభిన్న పాత్రల్లో విలన్ గా నటించి అందరి దృష్టిని ఎట్రాక్ట్ చేసిన శాండీ మాస్టర్ రీసెంట్ గా తన జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు. అందరూ ఏడిపించిన ఆ కళ్ల వల్లే తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని, ఆ కళ్లు చూసే లోకేష్ కనగరాజ్ తనకు లియోలో సైకో క్యారెక్టర్ ను ఆఫర్ చేశారని అన్నారు.
స్క్రీన్ పై చూసి అంతా షాకయ్యారు
లియో సినిమా తర్వాత తనకు సైకో క్యారెక్టర్లు ఎక్కువగా వస్తున్నాయని, ఆ సినిమా లేకపోతే కిష్కింధపురిలో ఛాన్స్ వచ్చేది కాదని చెప్పారు. కౌశిక్ తన క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం ఎంతో ఎగ్జైట్ చేసిందని, అందుకే ఆ క్యారెక్టర్ ను రిలీజ్ వరకు సీక్రెట గా ఉంచామని, రిలీజయ్యాక స్క్రీన్ పై తనను అలా చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారని చెప్పారు శాండీ.
విశ్వవ పుత్ర గా మెప్పించిన శాండీ
కిష్కింధపురిలో విశ్వవ పుత్ర అనే దెయ్యం పాత్రలో నటించిన శాండీకి అందరి నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. విశ్వవపుత్ర క్యారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు. అంగవైకల్యం ఉన్నట్టు కనిపించాలి, ప్రతీ సీన్ లోనూ తన పాత్రకు గూని ఉన్నట్టు చూపించాలి. అయినప్పటికీ ఆ పాత్రను ఎంతో ఈజ్ తో చేసి అందరినీ మెప్పించారు.
రూ. 100, 150 కోసం డ్యాన్స్ చేశా
తాను ఈ పొజిషన్ రావడానికి ఎంతో కష్టపడ్డానని, చిన్నప్పుడు రూ.100, రూ.150 కోసం గుళ్లల్లో, పెళ్లిళ్లలో డ్యాన్సులు వేశానని చెప్పిన శాండీ ప్రస్తుతం తన ఫోకస్ అంతా యాక్టింగ్ పైనే ఉందని, ప్రస్తుతం పా. రంజిత్ నిర్మాణంలో హీరోగా ఓ సినిమాను చేస్తున్నానని, మలయాళంలో కథనార్ లో విలన్ రోల్ చేస్తున్నానని చెప్పారు. అలా అని డ్యాన్స్ ను వదిలేయడం లేదని, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ లో ముందుకెళ్లాలనుకుంటున్నట్టు శాండీ చెప్పారు.