ఒకే ఫార్ములా ఫాలో అవుతున్న సందీప్.. వర్కౌట్ అవుతుందా?
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ ఎంతటి సెన్సేషన్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.;
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ ఎంతటి సెన్సేషన్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ జాబితాలోకి చేరిన ఆయన శిష్యుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఇప్పుడు అంతకుమించి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ సినిమాలు అంటే ఒక మార్క్ సెట్ చేస్తూ.. ఆయన క్రియేట్ చేస్తున్న సంచలనాలు ఇంకెన్నో.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఈ మూడు చిత్రాలతో కూడా సంచలనం సృష్టించారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ తానేంటో నిరూపించుకున్నారు. స్టార్ హీరోలు కూడా సందీప్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఇక ఆయన దగ్గర సత్తా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ తొలిసారి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను పంచుకున్నారు మేకర్స్. అందులో బేర్ బాడీ.. ఒంటినిండా గాయాలతో ఒక చేత్తో బీరు బాటిల్.. మరొకవైపు సిగరెట్ వెలిగిస్తూ హీరోయిన్ ని కూడా జత చేసి పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదంతా కాస్త పక్కన పెడితే.. తాజాగా స్పిరిట్ నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ , యానిమల్ సినిమాల నుండీ విడుదల చేసిన హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా అభిమానులు తెరపైకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ నాలుగు సినిమాల హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్లను మనం గమనించినట్లయితే.. హీరోలు సిక్స్ ప్యాక్ తో ఉండడమే కాకుండా బేర్ బాడీతో.. షర్ట్ లెస్ గా కనిపించి ఆశ్చర్యపరిచారు. ఇకపోతే సందీప్ రెడ్డి వంగ తన సినిమాలకు సంబంధించి హీరో ఫస్ట్ లుక్ లను అన్నింటినీ ఒకే తరహాలో రివీల్ చేయడం వైరల్ గా మారుతోంది. మరి ఈ నాలుగు చిత్రాల ఫస్ట్ లుక్స్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఆ మూడు చిత్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సందీప్ రెడ్డివంగా కూడా స్పిరిట్ మూవీ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ ని కూడా అదే తరహాలో రివీల్ చేశారు. మరి ఈ సెంటిమెంట్ ఆయనకు ఏ మేరకు వర్కౌట్ అవుతుందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇంకా ఈ సినిమాలో మొదట హీరోయిన్గా దీపికా పదుకొనేని అనుకొని కొన్ని కారణాలవల్ల ఆమెను తప్పించి.. యానిమల్ తో ఓవర్ నైట్ లోనే సంచలనం సృష్టించిన త్రిప్తి డిమ్రీకి మరోసారి తన సినిమాలో అవకాశం కల్పించారు సందీప్ రెడ్డి వంగ.
ఈ చిత్రాన్ని టి సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, కిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పాన్ వరల్డ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది ఈ చిత్రం.