వైరల్: వెనకనుంచి బాలయ్య కాళ్ళు మొక్కిన హీరోయిన్
ఇప్పటి తరం నటీమణులు సీనియర్ హీరోల పట్ల గౌరవంతో వ్యవహరించడం అంత సులభం కాదు. కానీ సంయుక్త చూపించిన గౌరవం, నమ్రతా ఎంతో గొప్పదని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.;
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పటి సీనియర్ స్టార్స్ తరహాలో గౌరవాలు అందుకునే ట్రెడిషన్ ఇప్పటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా సీనియర్ నటీనటుల ముందు వినయంగా ఉండే యంగ్ జెనరేషన్ నటులు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అలా ఇటీవల హైదరాబాదు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచోసుకున్న ఓ మూమెంట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.
హీరో బాలకృష్ణ, హీరోయిన్ సంయుక్త మీనన్ మధ్య చోటు చేసుకున్న ఈ లవ్లీ మూమెంట్ కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ఏలూరులో ఓ జ్యూవెలరీ షోరూమ్ ప్రారంభోత్సవం కోసం బాలకృష్ణ, సంయుక్త కలిసి పాల్గొన్నారు. వేగ జ్యూవెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలయ్య ఉన్న నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సంయుక్త మీనన్ కూడా అతిథిగా హాజరయ్యారు.
ఇక షాప్ ఓపెనింగ్ తర్వాత వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌కు విమానంలో తిరిగి వచ్చారు. అయితే ఎయిర్‌పోర్టులో బాలయ్య పక్కన నుంచున్న ఒక పెద్దావిడను నమస్కరిస్తుండగా, సంయుక్త బాలయ్యకు తెలియకుండా వెనక నుంచి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ సంఘటనతో బాలయ్య వ్యక్తిత్వం, సంయుక్త గౌరవం ఇద్దరికీ పెరిగిపోయాయి. బాలయ్య వెంటనే సంయుక్త తలపై చెయ్యి వేసి తన ఆశీర్వాదం అందించడం అభిమానులను హత్తుకునేలా చేసింది. ఇప్పటి తరం నటీమణులు సీనియర్ హీరోల పట్ల గౌరవంతో వ్యవహరించడం అంత సులభం కాదు. కానీ సంయుక్త చూపించిన గౌరవం, నమ్రతా ఎంతో గొప్పదని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే బాలకృష్ణ, సంయుక్త మీనన్ ప్రస్తుతం అఖండ 2: తాండవం చిత్రంలో కలిసి నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కు కొనసాగింపుగా రూపొందుతోంది. అఘోరా పాత్రలో బాలయ్య మళ్లీ పవర్ఫుల్ గా కనిపించనున్నారని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. ఆది పినిశెట్టి విలన్‌గా, సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం, విజువల్‌గా గ్రాండ్‌గా ఉండనుందని ట్రైలర్ టాక్. ఈసారి బాలయ్య–బోయపాటి కాంబో మరింత బలంగా ప్రేక్షకులను థ్రిల్ చేయనుంది.