అంతా దేవుడు దయ అనేసిన నటి!
ప్రణాళిక అన్నది అందరి విషయంలో ఒకేలా ఉండదు. కొందరి ప్రణాళిక సక్సెస్ అవుతుంది.;
ప్రణాళిక అన్నది అందరి విషయంలో ఒకేలా ఉండదు. కొందరి ప్రణాళిక సక్సెస్ అవుతుంది. మరికొంత మందిది ఫెయిల్ అవుతుంది. అందుకు కారణాలు అనేకం. కానీ దాని వెనుక దేవుడి రాత అన్నది ఒకటి రాసిపెట్టి ఉంటుందన్నది కొందరు నమ్మరు. మరికొంత మంది బలంగా విశ్వశిస్తారు. ఈ విషయంలో మలయాళ నటి సంయుక్తా మీనన్ తన కన్నా దేవుడినే ఎక్కువగా నమ్ముతానని చెప్పకనే చెప్పింది. కెరీర్ విషయంలో ఎన్నో ప్రణాళికలతో మొదలు పెడుతుంటాను. కానీ పరిణామాలు అందకు పూర్తి విరుద్దంగా సాగుతుంటాయంది
ముందు వెనకా అయిన చిత్రాలు:
`బింబిసార`, `విరూపాక్ష`, `సార్`, `భీమ్లా నాయక్` చిత్రాలకు ఒకేసారి సంతకం చేసానంది. కానీ వాటి విడుదలలు మాత్రం అనుకున్న విధంగా జరగలేదంది. `ముందు అనుకున్నది వెనక్కి వెళ్లింది. వెనుక అనుకున్నది ముందుగా రిలీజ్ అయింది. అదే తరహాలో ఇప్పుడు కూడా జరుగుతుందని తెలిపింది. `స్వయంభూ`, `నారీ నారీ నడుమ మురారీ`, `అఖండ-2` తో పాటు పూరి జగన్నాద్ సినిమాలకు ఒకేసారి సంతకం చేసానంది. కానీ `స్వయంభూ`, `నారీ నారీ నడుమ మురారీ` ఇప్పటికే విడుదలవ్వాలి. కానీ అలా జరగలేదు. వాటికంటే ముందే `అఖండ 2` రిలీజ్ అవుతుంది.
2026 లో ఆరేడు రిలీజ్ లు:
ఇలా రిలీజ్ అన్నది ముందు..వెనుక అవ్వడంపై తానెప్పుడూ నిరుత్సాహపడలేదంది. `నా ప్రణాళిక కంటే దేవుడి ప్రణాళికగా అవి రిలీజ్ అవుతున్నాయనిపిస్తుంది. ఇలా సాగడమే మేలు అని అనిపిస్తుంది. దైవాన్ని మించి ఏదీ లేదు. అలా జరిగితే సంతోషమే కదా? అని చెప్పుకొచ్చింది. ఏడాది ముగింపులో `అఖండ 2` తో రాబోతుంది. ఈ ఏడాది రిలీజ్ అవుతున్న ఒకే చిత్రమిది. కానీ 2026 లో మాత్రం సంయుక్త మీనన్ నుంచి వరుస రిలీజ్ లు క నిపిస్తున్నాయి. దాదాపు ఆరేడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. బాలీవుడ్ లో `క్వీన్ ఆఫ్ క్వీన్స్` లో నటిస్తోంది.
ఆ వివరాల్లో మాత్రం గోప్యత:
తెలుగులో `స్వయంభూ`, `నారీ నారీ నడుమ మురారీ`, పూరి-విజయ్ సేతుపతి సినిమాల్లో నటిస్తోంది. మాలీవుడ్ లో `రామ్`, కోలీవుడ్ లో `బెంజ్` లో నటిస్తోంది. ఆన్ సెట్స్ లో ఉన్న ఈ చిత్రాలన్నీ 2026లో రిలీజ్ అయ్యే చిత్రాలే. వీటిపై మంచి అంచనాలున్నాయి. 2024లో కూడా అమ్మడు హీరోయిన్ గా నటించిన సినిమా ఏదీ రిలీజ్ అవ్వలేదు. `లవ్ మీ` అనే చిత్రంలో గెస్ట్ అప్పిరియన్స్ తో అలరించింది. ఈ రెండేళ్లు గ్యాప్ ఇచ్చినా? కొత్త ఏడాది లో మాత్రం ఏడాదంతా సందడి చేయడం షురూ. అలాగే అమ్మడు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లకు కమిట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. వాటి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచింది.