SYG.. మెగా సుప్రీం హీరో బిగ్ షాక్..!
సంబరాల యేటిగట్టు సినిమా పీరియాడికల్ యాక్షన్ మూవీగా ఫస్ట్ లుక్ టీజర్ తోనే వారెవా అనిపించింది. ఈ సినిమా కోసం సాయి తేజ్ తన బెస్ట్ ఎఫర్ట్ పెట్టేస్తున్నారట.;
మెగా మేనల్లుడు మెగా సుప్రీం హీరో సాయి ధరం తేజ్ హీరోగా రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సంబరాల యేటిగట్టు. ఈ సినిమాను ప్రైం షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమా అనౌన్స్ మెంట్ రోజే పీరియాడికల్ మూవీగా ఇది వస్తుందని గ్లింప్స్ వదిలారు. ఐతే ఈ సినిమా విషయంలో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమా అనౌన్స్ మెంట్ వీడియోలోనే సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ అని ప్రకటించారు. ఐతే సినిమా ఇంకా పూర్తి కాలేదని వాయిదా పడినట్టే అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఐతే ఆ విషయాన్నే ప్రైం షో ఎంటర్టైన్మెంట్స్ లేటెస్ట్ గా అనౌన్స్ చేసింది.
సంబరాల యేటిగట్టు బెస్ట్ ఎక్స్ పీరియన్స్..
సంబరాల యేటిగట్టు సినిమా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని.. సినిమా కొన్నాళ్ల పాటు చర్చించేలా తెరకెక్కిస్తున్నామని.. సినిమాకు సీజీ వర్క్ చాలా బాగా చేయాలనే ఉద్దేశ్యంతో సినిమా వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. అద్భుతమైన టెక్నికల్ టీం తో సినిమా వస్తుందని సినిమా కచ్చితంగా బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు.
సంబరాల యేటిగట్టు సినిమా పీరియాడికల్ యాక్షన్ మూవీగా ఫస్ట్ లుక్ టీజర్ తోనే వారెవా అనిపించింది. ఈ సినిమా కోసం సాయి తేజ్ తన బెస్ట్ ఎఫర్ట్ పెట్టేస్తున్నారట. సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుంది. సినిమాలో ఆమెకు కూడా అద్భుతమైన రోల్ పడిందని అంటున్నారు. సంబరాల యేటిగట్టు సినిమాను సెప్టెంబర్ 25 దసరా కానుకగా రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా ఇంకా లేట్ అయ్యేలా ఉంది.
తేజ్ నుంచి వస్తున్న సినిమా..
బహుశా మేకర్స్ అనౌన్స్ చేయలేదు కానీ చూస్తుంటే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ దాకా వెళ్లేలా ఉంది. సంబరాల యేటిగట్టు సినిమా డైరెక్టర్ రోహిత్ ఈ సినిమాను చాలా పెద్ద ప్లానింగ్ తోనే చేస్తున్నాడట. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటాయని టాక్. బ్రో సినిమా తర్వాత తేజ్ నుంచి వస్తున్న సినిమా అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ మీద సూపర్ క్రేజ్ ఉంది.
మెగా సుప్రీం హీరోగా మెగా ఫ్యాన్స్ మనసులు గెలిచిన తేజ్ మళ్లీ కెరీర్ లో స్పీడ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సంబరాల యేటిగట్టు కోసం అతని పూర్తిస్థాయి మేకోవర్ కూడా ఉంటుందని టాక్. మరి సినిమాపై మేకర్స్ చాలా బలమైన నమ్మకంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా సినిమా అదరగొట్టే ఛాన్స్ ఉండేలా ఉంది.