• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సామ్ బ‌హ‌దూర్ ట్రైల‌ర్:...

సామ్ బ‌హ‌దూర్ ట్రైల‌ర్: గెలిచి తీర్తాన‌నే యుద్ధ వీరుడి పంతం

| మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్, సన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రలు పోషించారు.

By - Tupaki Desk
Update: 2023-11-08 10:49 GMT

విక్కీ కౌశల్ న‌టించిన 'సామ్ బహదూర్' ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్, సన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రలు పోషించారు. రోనీ స్క్రూవాలా నిర్మించారు. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది. ట్రైల‌ర్ ఆద్యంతం ఒక యుద్ధ వీరుడి ప‌ట్టుద‌ల పంతం ఎలా ఉంటుందో ప్ర‌తి ఫ్రేమ్ లో ఆవిష్క‌రించిన తీరు ఆక‌ట్టుకుంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే- చిత్ర బృందం సమక్షంలో ట్రైల‌ర్ ని ఆవిష్కరించారు. ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా నిజ జీవిత క‌థ ఇది. ఇందులో టైటిల్ పాత్ర‌లో విక్కీ కౌశ‌ల్ అద్భుతంగా న‌టించారు. ముఖ్యంగా సామ్ మానేక్ష బాడీ లాంగ్వేజ్ ని అత‌డు అన్వ‌యించుకున్న తీరు ఆస‌క్తిని క‌లిగిస్తోంది. చూసే చూపు.. న‌డ‌క‌.. న‌డ‌త‌.. ఆహార్యం ప్ర‌తిదీ సామ్ మానేక్ష‌ను పోలి ఉండాల‌ని అత‌డు చేసిన ప్ర‌య‌త్నం ఆక‌ట్టుకుంది. మానేక్ష భార్య‌ పాత్ర‌లో ఫాతిమా స‌నా షేక్ న‌టించింది. ఇండియా పాక్ బార్డ‌ర్లో యుద్ధం.. నాటి రాజ‌కీయాలను ఈ ట్రైల‌ర్ లో స్పృషించారు. నాటి రాజ‌కీయాల్లో ఇందిర‌మ్మ‌ కోణం ఇందులో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా, ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా ఆన్ స్క్రీన్‌పై నటించడం తనకు ఎంత సవాల్ గా నిలిచిందో విక్కీ కౌశల్ వెల్ల‌డించారు. విక్కీ మాట్లాడుతూ, "నన్ను ఈ సినిమాలో నటించే అవ‌కాశం క‌ల్పించినందుకు ఫిలింమేక‌ర్ మేఘనా గుల్జార్‌కి కృతజ్ఞతలు. రాజీ చిత్రీకరిస్తున్నప్పుడు మేఘ‌న‌ మొదట నాతో స్క్రిప్ట్‌ను ప్రస్తావించినప్పుడు, నేను అతడి(సామ్ మానేక్ష‌) కోసం వెతికాను. నేను అతని గురించి చాలా విన్నాను కాబట్టి అతను ఎలా ఉన్నాడో ప‌రిశోధించాను. సామ్ మానెక్షా ఎలా కనిపిస్తున్నాడో ఎప్పుడూ చూడలేదు. నేను అతడిని మొదటిసారి చూసినప్పుడు అతడు చాలా అందంగా ఉన్నాడు అనుకున్నాను. ఈ పాత్ర నాకు ఎప్పటికీ రాదని నేను అనుకున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేఘనకు కృతజ్ఞతలు... అని అన్నారు.

ఈ చిత్రంలో భారతదేశపు యుద్ధ వీరుడు.. మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా పాత్రను విక్కీ కౌశ‌ల్ పోషించారు. త‌న పాత్ర గురించి విక్కీ మాట్లాడుతూ.."ఇది నేను ఇప్పటివరకు పోషించిన కష్టతరమైన పాత్ర,.. మానేక్ష‌ ఎలా మాట్లాడతాడు? ఎలా నడుచుకుంటాడు? అనే దాని గురించి మాత్రమే కాదు.. అలాంటి వ్యక్తి కారణంగా నేను చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇది నిజంగా మేఘన అండ టీమ్ ఎఫర్ట్ .. భారీ రీసెర్చ్ వర్క్ జ‌రిగింది.. అని తెలిపారు. సామ్ మానేక్షా గుణగ‌ణాల గురించి ప్ర‌శ్నించ‌గా.. అత‌డు ఇలా అన్నాడు. సామ్ మానేక్ష‌ 40 ఏళ్ల కెరీర్‌లో అతిపెద్ద విజయం ఏమిటి? అని అడిగారు. అతడు తన జవాన్లలో ఎవరినీ శిక్షించలేదని విక్కీ చెప్పాడు. అన్ని అధికారాలు ఉన్నప్పటికీ అత‌డిలోని కరుణను నేను నిజంగా ఆరాధిస్తాను అని కూడా అన్నారు.

రీసెర్చ్ వర్క్ గురించి విక్కీ మాట్లాడుతూ.."నేను మేఘన చాలా ప‌రిశోధించాం. అతడు ఎలా నడుచుకుంటాడు? ఎలా మాట్లాడతాడు? ఆయ‌న‌ ప్రవర్తన గురించి చాలా పరిశోధన చేసాము. మేము ఆయ‌న‌ వీడియోలను చూశాము. అతని గురించి చాలా చదివాము. స్క్రిప్ట్ గురించి ఐదు లేదా ఆరు గంటలు చర్చించాము. కాబట్టి అలాంటి పాత్రను తెరపైకి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆదివారాలే కాదు, సెలవు దినాలు లేవు. నిరంతరం ప్రిపరేషన్ సాగించాం. మేము అతని కుటుంబ సభ్యులను కలుసుకున్నాము. వారు నిజంగా చాలా సహాయం చేసారు. అత‌డి జీవితంలోని ప్రతి అంశాన్ని క్యాప్చర్ చేయడానికి నా ఫోన్‌లో ఆయ‌న‌కు సంబంధించిన‌ 200 ఫోటోలు దాచాను.. అని తెలిపారు. సామ్ మానేక్ష‌ ఆత్మ -మనస్తత్వాన్ని సరిగ్గా తెలుసుకోవ‌డానికి చాలా శ్ర‌మించామ‌ని మేఘ‌న గుల్జార్ అన్నారు.

ఫాతిమా సనా షేక్ -సన్యా మల్హోత్రా మాట్లాడుతూ, దర్శకురాలు తమ పాత్రల స్కిన్‌లోకి రావడానికి సహాయం చేసార‌ని, సామ్ భార్య అయిన సిల్లూ మానేక్షా పాత్రను పోషించడానికి తాను చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నించాన‌ని కూడా సన్యా తెలిపింది. ఆమె పాత్ర గురించి చదివి, చాలా పరిశోధన చేసారు... అని తెలిపారు.

విక్కీ త‌దుప‌రి కెరీర్ గురించి వివ‌రాలు చూస్తే... దర్శకుడు ఆనంద్ తివారీ రొమాంటిక్ చిత్రంలో ట్రిప్తి డిమ్రీ - అమీ విర్క్‌లతో కలిసి విక్కీ కూడా కనిపిస్తాడు. కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం 23 ఫిబ్రవరి 2024న థియేటర్లలోకి రానుంది. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తదుపరి చిత్రం 'చావా'లో న‌టించాడు. రష్మిక మందన్న క‌థానాయిక‌. 6 డిసెంబర్ 2024న థియేటర్లలోకి రానుంది.

Full View
Tags:    
  • Sambahadur 
  • Bollywood 
  • Trailer 
  • Vickykaushal 
  • Meghnagulzar 
  • Ronnies 
  • Shankarehsanloy 
  • Sambahadurmovie 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS