• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రెండ్ హ‌బ్బీకి స‌మంత...

ప్రెండ్ హ‌బ్బీకి స‌మంత ఛాన్స్ ఇస్తుందా?

| ఇటీవ‌లే స‌మంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ట్రలాలా అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థ‌ని స్థాపించింది.

By - Tupaki Desk
Update: 2024-01-21 12:14 GMT

ఇటీవ‌లే స‌మంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ట్రలాలా అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థ‌ని స్థాపించింది. యువ ప్ర‌తిభావంతుల్ని ప్రోత్స‌హించ‌డంతో పాటు తాను బ్యాన‌ర్ ద్వారా డ‌బ్బు సంపాదించాల‌నే దృక్ఫ‌ధంతో ఈ బ్యాన‌ర్ స్థాపించింది. ప‌నిలో ప‌నిగా ఓ ప్రముఖ త‌మిళ వెర్ష‌న్ మ్యూజిక్ ఛానెల్ లో ఓ షోని సైతం నిర్మిస్తుంది. ఆ ర‌కంగా అమ్మ‌డు సినిమాల‌తో పాటు బుల్లి తెర‌పైనా స‌త్తా చాటే ఓ ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టింది.

అయితే తొలి సినిమా ఏ ద‌ర్శ‌కుడితో నిర్మిస్తుంది? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా వార్త రాలేదు. గాసిప్ కూడా తెర‌పైకి రాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆ సినిమా ఛాన్స్ స్నేహితురాలు భ‌ర్త‌కు ఇచ్చిన‌ట్లు కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. చిన్మ‌యి భ‌ర్త రాహుల్ ర‌వీంద్ర‌న్ తో స‌మంత త‌న తొలి సినిమా నిర్మించే దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు లీకులందుతున్నాయి. ప్ర‌స్తుతం ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌లో `ది గ‌ర్ల్ ప్రెండ్` అనే చిత్రాన్ని రాహుల్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా షూట్ లోనే ఆయ‌న బిజీగా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో స‌మంత అతని ప‌నిత‌నం మెచ్చి తొలి సినిమా రాహుల్ తో నిర్మించే దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలిసింది. `చిల‌సౌ`తో రాహుల్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. అటుపై నాగార్జున హీరోగా `మ‌న్మ‌ధుడు-2`ని తెర‌కెక్కించాడు. కానీ ఈ సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. కానీ మేక‌ర్ గా మాత్రం ఫెయిల్ అవ్వ‌లేదు.

త‌న‌లో ఆ ప్ర‌తిభ చూసే ర‌ష్మిక కూడా `ది గ‌ర్ల్ ప్రెండ్` చిత్రానికి ప‌నిచేసే అవ‌కాశం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె పేరు పాన్ ఇండియాలో మారు మ్రోగిపోతుంది. తాజాగా స‌మంత ఛాన్స్ క‌న్ప‌మ్ అయితే రాహుల్ మ‌రింత ఫేమ‌స్ అయిపోతాడు. చిన్మ‌యి-స‌మంత మంచి స్నేహితులు అన్న సంగ‌తి తెలిసిందే. చిన్మ‌యి భర్త రాహుల్. న‌టుడిగా స‌క్సెస్ కాని రాహుల్ ద‌ర్శ‌కుడిగా మాత్రం ప్రూవ్ చేసుకుంటున్నాడు.

Tags:    
  • Samantha 
  • Chinmayi 
  • Movies 
  • Producer 
  • Rahulravindran 
  • Filmindustry 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS