సామ్.. జంప్ సూట్ లో సింపుల్ గా!

అక్కినేని నాగచైతన్య తో పెళ్లి అయిన తర్వాత కూడా నంబర్ వన్ హీరోయిన్ గా సాగిన ఈ అమ్మడు.. విడాకుల తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంది.

Update: 2024-05-18 13:57 GMT

ఏ మాయ చేసావే అంటూ ఫస్ట్ మూవీతోనే తెలుగు సినీ ప్రియులను మాయ చేసిన సమంత.. 14 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తన యాక్టింగ్ తో సత్తా చాటుతోంది. కెరీర్ స్టార్టింగ్ లో కమర్షియల్ సినిమాలు చేసిన సమంత.. ఈ మధ్య సోలో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ అదరగొడుతోంది. అక్కినేని నాగచైతన్య తో పెళ్లి అయిన తర్వాత కూడా నంబర్ వన్ హీరోయిన్ గా సాగిన ఈ అమ్మడు.. విడాకుల తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంది.


కొన్ని నెలల క్రితం మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డ సమంత.. కొన్నేళ్లుగా ట్రీట్మెంట్ తీసుకుంటోంది. విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసిన తర్వాత విదేశాలకు వెళ్లిపోయింది. సినిమాలకు కూడా సామ్ గ్యాప్ ఇచ్చింది. విదేశాల్లో ఫుల్ రెస్ట్ తీసుకుని కొండల్లో, కోనల్లో సేదతీరింది. పలు ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా విజిట్ చేసింది. ఇక రీసెంట్ గా సమంత.. ఇండియాకు చేరుకుంది. వరుస సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.


ఇక సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది సమంత. ఎప్పటికప్పుడు పిక్స్ పోస్ట్ చేస్తుంటోంది. ఒక్కోసారి గ్లామర్ గేట్లు ఎత్తేసి అందాలు ఆరబోస్తుంటోంది. అదిరిపోయే ఔట్ ఫిట్లలో ఫోటోస్ దిగి పంచుకుంటోంది. తన ఫాలోవర్స్ ను డైలీ పలకరిస్తూ ఉంటోంది. కొన్ని సార్లు హెల్త్ కు సంబంధించిన విషయాలు కూడా షేర్ చేస్తుంటోంది. సామ్ క్రేజీ పిక్స్ డైలీ ట్రెండింగ్ లోనే ఉంటుంటాయి.

అయితే సమంత.. తాజాగా ఇంట్రెస్టింగ్ పిక్స్ అండ్ వీడియోస్ షేర్ చేసింది. ఫస్ట్ పిక్ లో సామ్.. డీసెంట్ జంప్ సూట్ లో సింపుల్ గా పోజు ఇచ్చింది. మరో ఫోటోలో వైట్ టీ షర్ట్, జీన్ ప్యాంట్ తో అట్రాక్ట్ చేస్తోంది. తన పెట్స్ పిక్స్ కూడా షేర్ చేసింది. ఓ పెట్ ను ఆడిస్తూ ముద్దు పెడుతున్న వీడియో పోస్ట్ చేసింది. కారు అండ్ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్న గ్లింప్స్ కూడా పంచుకుంది. ప్రస్తుతం సామ్ పిక్స్, వీడియోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Read more!

ఇక త్వరలోనే సమంత.. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో సందడి చేయనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన సిటాడెల్ సిరీస్ కోసం సామ్ చాలా కష్టపడింది. రీసెంట్ గా తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై 'మా ఇంటి బంగారం' సినిమాను అనౌన్స్ చేసింది. కానీ ఆ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. మరి ఈ చిత్రం అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Tags:    

Similar News