బటన్ లెస్ ఫోజులతో గుబులు రేపిన ఖుషీ
ఖుషీ జెన్ జెడ్ ఫ్యాషన్ ఐకాన్‌గా దూసుకుపోతోంది. ప్రయోగాత్మక ఫ్యాషన్ సెన్స్ తో యూత్ కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది.;
అతిలోక సుందరి శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ నిరంతర ఫొటోషూట్‌లతో చెలరేగిపోతోంది. ముఖ్యంగా తన సోదరి జాన్వీ కపూర్‌తో పోలిస్తే ఖుషీ స్టైల్ మరింత బోల్డ్‌గా ఉంటుందని అభిమానులు చెబుతున్నారు. ఖుషీ జెన్ జెడ్ ఫ్యాషన్ ఐకాన్‌గా దూసుకుపోతోంది. ప్రయోగాత్మక ఫ్యాషన్ సెన్స్ తో యూత్ కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది.
అయితే నటిగా ఖుషీ కపూర్ కెరీర్ ఆశించిన స్థాయిలో టేకాఫ్ కాలేదు. ఈ బ్యూటీ నటించిన మొదటి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన `ది ఆర్చీస్` సిరీస్‌లో ఖుషి నటించింది. కానీ నటన పరంగా మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తర్వాత రెండు సినిమాల్లోను ఖుషి నటించింది కానీ అవీ కలిసి రాలేదు. ఆమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన నటించిన లవ్ యాపా (తమిళ చిత్రం లవ్ టుడే రీమేక్) థియేటర్లలో ఆశించిన ప్రభావాన్ని చూపలేకపోయింది. ఆ తర్వాత ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి నటించిన నదనియాన్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది.
ఖుషీ కపూర్ ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. శ్రీదేవి నటించిన హిట్ సినిమా `మామ్` సీక్వెల్ `మామ్-2`లో ఖుషీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఖుషీ కెరీర్‌కు చాలా కీలకం కానుంది. మరోవైపు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ అరంగేట్రం చేస్తున్న సినిమాలో ఖుషీ కపూర్ హీరోయిన్‌గా నటించబోతోందని కథనాలొచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి తాజా అప్ డేట్ రాలేదు. మరోవైపు తమిళ నటుడు అథర్వ మురళి సరసన ఒక రొమాంటిక్ డ్రామాతో తమిళంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఆకాష్ దర్శకత్వం వహించబోతున్నారు. ఖుషీ తన తల్లి శ్రీదేవి లాగే సౌత్ సినిమాల్లో కూడా తన ముద్ర వేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కానీ ఇంకా ఆరంభ దశలోనే ఉంది.
మరోవైపు ఫ్యాషన్ ప్రపంచంలోను ఖుషి మెరుపులు మెరిపిస్తోంది. నేటితరం నేపో కిడ్స్‌లో ఖుషీ స్పీడ్ అంతా ఇంతా కాదని ఇప్పటికే ప్రూవైంది. తన సోదరి జాన్వీ కపూర్ ని మించి ఖుషీ కపూర్ బోల్డ్ లుక్స్‌తో చెలరేగిపోతోంది. తాజాగా డెనిమ్ జీన్స్ (బాటమ్) బటన్ ఓపెన్ చేసి టాప్ ఇన్నర్ అందాలను ఎలివేట్ చేస్తూ ఖుషీ ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ లో గుబులు రేపుతున్నాయి. ఖుషి స్టన్నింగ్ లుక్ వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఆ ఎరుపు- తెలుపు గళ్ల ఇన్నర్ పీస్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కితాబిచ్చేస్తున్నారు. ఖుషీ ఎప్పటిలాగే టూ బోల్డ్ గా చెలరేగిపోయిందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.