సామ్.. ఆ రెండు సినిమాల సంగతేంటి?

బాలీవుడ్ వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ్ లో కూడా కనిపించనున్నారు. అదే సమయంలో సామ్ అప్ కమింగ్ చిత్రాల కోసం సోషల్ మీడియా కొత్త కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.;

Update: 2025-08-13 05:28 GMT

స్టార్ హీరోయిన్ సమంత అప్ కమింగ్ ప్రాజెక్టుల కోసం ఆమె అభిమానులతోపాటు మూవీ లవర్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. మళ్లీ అప్పటిలా వరుసగా సిల్వర్ స్క్రీన్ పై సమంత సందడి చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు. అందులో భాగంగా సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా అవి ఫుల్ గా వైరల్ చేస్తున్నారని చెప్పాలి.

రీసెంట్ గా నిర్మాతగా సామ్.. శుభం మూవీతో సందడి చేసిన విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించిన ఆ చిత్రంలో క్యామియో రోల్ తో మెప్పించారు. ఇప్పుడు మా ఇంటి బంగారం చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమాను కూడా ఆమెనే తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ్ లో కూడా కనిపించనున్నారు. అదే సమయంలో సామ్ అప్ కమింగ్ చిత్రాల కోసం సోషల్ మీడియా కొత్త కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఎలాంటి క్లారిటీ రావడం లేదు. అటు ఆయా సినిమాల మేకర్స్ గానీ.. సమంత గానీ ఇంకా స్పందించడం లేదు. దీంతో అంతా వెయిట్ చేస్తున్నారు.

రంగస్థలం మూవీకిగా స్టార్ హీరో రామ్ చరణ్ తో ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకున్న సమంత.. ఇప్పుడు మరోసారి జత కట్టనున్నట్లు కొన్నిరోజులుగా టాక్ వినిపిస్తోంది. సదరు ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అప్పుడే వార్తలు రాగా.. ఇప్పుడు మళ్లీ వినిపిస్తున్నాయి. చరణ్ అప్ కమింగ్ పెద్ది మూవీలో సామ్ ఐటెమ్ సాంగ్ లో సందడి చేయనున్నారని వినికిడి.

ఇప్పటికే సమంత పుష్పలో చేసిన సాంగ్‌ తో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌ సృష్టించగా.. ఇప్పుడు మరోసారి అదే రేంజ్ సాంగ్ లో కనిపించి స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం. మరోవైపు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. మరికొద్ది రోజుల్లో ఖైదీ 2 మూవీ మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ లో స్టార్ హీరో కార్తీ సరసన సమంత హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అల్లు అర్జున్- అట్లీ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ చేస్తారని టాక్ వచ్చినా.. అది నిజం కాదని క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు రామ్ చరణ్, కార్తీ సినిమాల్లో సామ్ భాగమవుతారో లేదో.. ఆ వార్తలు నిజమో కావో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News