అక్కినేని ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన సమంత
అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన లెనిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా సినీ పరిశ్రమ నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన లెనిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా సినీ పరిశ్రమ నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కినేని మాజీ కోడలు, స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. సినిమా రిలీజ్ రోజున లెనిన్ టీమ్‌కు, ముఖ్యంగా అఖిల్‌కు ఆమె బెస్ట్ విషెస్ తెలియజేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సమంత తన పోస్ట్‌లో లెనిన్ ట్రైలర్‌ను షేర్ చేస్తూ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ వైబ్స్ వినిపిస్తున్నాయని పేర్కొంటూ, టీమ్‌కు మంచి సక్సెస్ దక్కాలని ఆకాంక్షించారు. సినిమా రిలీజైన రోజునే ఆమె చేసిన ఈ పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా, సినీ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది.
రీసెంట్ గా సమంత ప్రధాన పాత్రలో వచ్చిన మా ఇంటి బంగారం మంచి సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా గురించి రీసెంట్ గా లెనిన్ ప్రమోషన్స్ లో అఖిల్ మాట్లాడారు. తాను లెనిన్ వర్క్స్ లో బిజీగా ఉండటం వల్ల సినిమాను ఇంకా చూడలేదని, కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో యాక్షన్‌కు పెద్దపీట వేయడం తనకు బాగా నచ్చిందని, సమంతకు మంచి సక్సెస్ దక్కినందుకు తనకెంతో సంతోషంగా ఉందని అన్నాడు. ఒకరి సినిమాపై మరొకరు ఇలాంటి సానుకూల స్పందన వ్యక్తం చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
సమంత, నాగ చైతన్య పర్సనల్ లైఫ్ లో వేర్వేరు మార్గాలు ఎంచుకున్నప్పటికీ, అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ తో ఆమె వ్యవహారంలో ఎలాంటి మార్పు కనిపించలేదనే అభిప్రాయం ఇప్పుడు మరోసారి వ్యక్తమవుతోంది. వ్యక్తిగత విషయాలను వృత్తిపరమైన సంబంధాలపై ప్రభావం చూపకుండా, ఒకరి సక్సెస్ ను మరొకరు అభినందించడం మెచ్యూరిటీకి నిదర్శనమని పలువురు సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాలో కూడా సమంత పోస్ట్‌కు విశేష స్పందన లభిస్తోంది. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సమంత ఫ్యాన్స్ కూడా ఈ వ్యవహారాన్ని ప్రశంసిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణానికి ఇలాంటి పరస్పర గౌరవమే బలమని, వ్యక్తిగత విభేదాల కంటే వృత్తిపరమైన మర్యాదకు ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామమని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, లెనిన్ సినిమాకు ఫస్ట్ షో నుంచే ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా అఖిల్ కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ గా నిలిచే కీలక మైలురాయిగా నిలుస్తుందా అనేది తెలియాల్సి ఉంది.