చరణ్ చేతికి బ్యాండేజ్.. అనుకున్నట్లే ముందుకెళ్తారా?
సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు ఇంటికి పిలిచి వారితో హ్యాపీగా గడిపారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, చరణ్ చేతికి బ్యాండేజ్ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతికి బ్యాండేజ్ కనిపించడం ఇప్పుడు అభిమానుల్లో కొత్త చర్చకు కారణమవుతోంది. రీసెంట్ గా ఇరుముడి మూవీ టీమ్ కు చిరంజీవి, రామ్ చరణ్ విషెస్ చెప్పారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు ఇంటికి పిలిచి వారితో హ్యాపీగా గడిపారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, చరణ్ చేతికి బ్యాండేజ్ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పెద్ది సినిమా షూటింగ్ లో గాయపడిన చరణ్ మణికట్టుకు ఇటీవల ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారు. అయితే ఆ గాయం ఎఫెక్ట్ ఆయన కొత్త సినిమా పడుతుందా, లేక అనుకున్న సమయానికి షూటింగ్ మొదలవుతుందా అన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది. నిజానికి చరణ్ పూర్తిగా కోలుకోవడం ఆయనకు ఇప్పుడు చాలా ముఖ్యం.
ముఖ్యంగా భారీ యాక్షన్ సీన్స్, ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ అవసరమయ్యే రోల్స్ చేయాల్సి వస్తే చేతి గాయం నుంచి పూర్తి రికవరీ అవసరం ఉంటుంది. అందుకే కొత్త సినిమా పనుల విషయంలో కూడా మేకర్స్ చరణ్ హెల్త్ ను దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక చరణ్ తన నెక్స్ట్ మూవీని సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. రంగస్థలం తర్వాత ఆ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.
ప్రస్తుతం క్యాస్టింగ్, టెక్నీషియన్స్ సెలక్షన్ వంటి పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే దసరా సందర్భంగా సినిమాను గ్రాండ్ గా స్టార్ట్ చేసి, ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే అక్టోబర్ లో పూజా కార్యక్రమాలు, నవంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టాలన్నది మేకర్స్ ఆలోచనగా కనిపిస్తోంది.
అయితే చేతికి ఆపరేషన్ జరిగిందన్న కారణంతోనే షూటింగ్ వాయిదా పడుతుందని ఇప్పుడే చెప్పలేం. సినిమా షూటింగ్ ప్రారంభానికి ఇంకా కొంత సమయం ఉంది. అప్పటిలోగా చరణ్ పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. పైగా ఫస్ట్ షెడ్యూల్ లో ఆయన పాల్గొనాల్సిన సన్నివేశాలను కూడా పరిస్థితికి తగ్గట్టుగా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు సినిమా కోసం చరణ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది.
రోల్ కు తగ్గట్టుగా తన లుక్ ను మార్చుకునే పనిలో ఆయన ఉన్నట్లు సమాచారం. దీంతో షూటింగ్ స్టార్ట్ అయ్యేలోపు గాయం నుంచి కోలుకోవడంతో పాటు, పాత్ర కోసం అవసరమైన మార్పులను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అందుకే చరణ్ చేతికి బ్యాండేజ్ కనిపించడం అభిమానుల్లో కాస్త టెన్షన్ పెంచినా.. ఇప్పటికైతే సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.