సండే ఈజ్ ఫండే: ఈ రోజు ‘నో ఎలిమినేషన్’

శనివారం ఎపిసోడ్ లో త్రిగుణ్, రోహిత్, షాలిని, రామ్ ప్రసాద్‌ల ఆటతీరుపై నాగార్జున అసహనం వ్యక్తం చేస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Update: 2026-09-13 16:58 GMT

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 'దశావతారం' కాన్సెప్ట్‌తో విభిన్నంగా సాగుతోంది. మొదటి వారం పూర్తి కాక ముందే ఇద్దరు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి చరిత్రలో కనీవినీ ఎరుగని షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్.

శనివారం ఎపిసోడ్ లో త్రిగుణ్, రోహిత్, షాలిని, రామ్ ప్రసాద్‌ల ఆటతీరుపై నాగార్జున అసహనం వ్యక్తం చేస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. మిడ్-వీక్‌లో ఎలిమినేట్ అయిన చరణ్ మహదేవ్, చైత్ర రాయ్ వీడియో కాల్ ద్వారా కంటెస్టెంట్లతో మాట్లాడారు. వారు సీక్రెట్ రూమ్‌లో ఉన్నారనే ఊహాగానాలకు తెర దించుతూ, వారు పూర్తిగా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున స్పష్టం చేశారు.

టాస్క్‌లు గెలిచి రోహిత్ నాయుడు, టెంపర్ వంశీ, రామ్ ప్రసాద్ ఇప్పటికే హౌస్‌మేట్స్‌గా మారగా, మిగిలిన వారు ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎంపికయ్యారు. హీరో త్రిగుణ్ పేరును ఇసుక బోర్డుపై రివీల్ చేసి హౌస్‌మేట్‌గా కన్ఫర్మ్ చేశారు. అత్యధిక ఓట్లు సాధించిన కామన్ కంటెస్టెంట్ షాలిని ఎంపికైంది. ఇకపై ఏడవనని, తన ఆటతో సత్తా చాటుతానని ఆమె ప్రేక్షకులకు మాటిచ్చింది.

సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్ ఆరవ హౌస్‌మేట్‌గా సేఫ్ అయిందని నాగార్జున ప్రకటించారు.

మిగిలిన ఎనిమిది మంది కంటెస్టెంట్లు తీవ్ర డేంజర్‌లో ఉన్నట్లు నాగార్జున హెచ్చరించారు. ఆ జాబితాలో వర్షిణి సౌందరరాజన్, సుధీర్ రెడ్డి, సృష్టి వ్యాకరణం, జబర్దస్త్ నరేష్, నటుడు కృష్ణుడు, ముఖేష్ గౌడ, అమన్ మసూద్, సింగర్ ఝాన్సీ ఉన్నారు. వచ్చే వారం కూడా ఆట తీరు మెరుగు పరుచుకోకపోతే ఎలిమినేషన్ తప్పదని స్పష్టం చేశారు.

ఆదివారం ఎపిసోడ్‌లో తక్కువ ఓట్లు వచ్చిన నటుడు కృష్ణుడు ఎలిమినేట్ అవుతాడని ముందుగా పుకార్లు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈరోజు ఎలాంటి ఎలిమినేషన్ ఉండదు. ఇప్పటికే ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయినందున, ఈ వారాంతంలో ఎవరినీ పంపించకుండా నాగార్జున ఊరటనిచ్చినట్లు లీక్డ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మరో వైపు, ఇంకో ఇద్దరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ త్వరలోనే షో లోకి ఎంటర్ అవుతారు అనే ఊహాగానాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే వరం నామినేషన్స్ మాత్రం అదిరిపోతాయి అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Tags:    

Similar News