సరికొత్త కాన్సెప్ట్ తో 'అనుమాన పక్షి'.. తుపాకీ స్పెషల్ ఇంటర్వ్యూలో ఎన్నో విశేషాలు..

డీజే టిల్లు తర్వాత నాలుగేళ్ల గ్యాప్ రావడంపై విమల్ కృష్ణ స్పందిస్తూ, అది కావాలని తీసుకున్న గ్యాప్ కాదని క్లారిటీ ఇచ్చారు.

Update: 2026-09-13 12:30 GMT

టాలీవుడ్ లో డీజే టిల్లు' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ విమల్ కృష్ణ నుంచి వస్తున్న సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రాబోతోంది. డీజే టిల్లు తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఈ కొత్త సినిమాలో ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన సర్ప్రైజ్‌లు ఏంటి? లాంటి విషయాలను విమల్ కృష్ణ రీసెంట్‌గా తుపాకీ ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం.

అనుమానం చుట్టూ తిరిగే కథ:

మనం రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఒక సాధారణమైన సమస్య 'అనుమానం'. దీని చుట్టూ ఒక ఫన్నీ అండ్ రిలేటబుల్ క్యారెక్టర్‌ను క్రియేట్ చేయాలన్న ఆలోచనతో పుట్టిందే 'అనుమాన పక్షి'. ఇక డిఫరెంట్ ఫ్లేవర్, యూనిక్ కామెడీ ఎలిమెంట్స్‌తో ఈ కథ అందరికీ ఘోరంగా కనెక్ట్ అవుతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు.

గ్యాప్ కావాలని తీసుకున్నది కాదు:

డీజే టిల్లు తర్వాత నాలుగేళ్ల గ్యాప్ రావడంపై విమల్ కృష్ణ స్పందిస్తూ, అది కావాలని తీసుకున్న గ్యాప్ కాదని క్లారిటీ ఇచ్చారు. వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ కావాల్సి ఉన్నా, కొన్ని అన్అవాయిడబుల్ రీజన్స్ వల్ల వాయిదా పడిందని చెప్పారు. ఆ తర్వాతే 'అనుమాన పక్షి' స్క్రిప్ట్ పూర్తయి, ప్రొడ్యూసర్ రాజీవ్‌కు నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది.

హీరోగా రాగ్ మయూర్ ఎందుకంటే? :

ఈ కథకు మొదటి నుంచి రాగ్ మయూర్ మాత్రమే తన ఛాయిస్ అని విమల్ కృష్ణ చెప్పారు. 'సినిమా బండి' సినిమాలో అతని కామెడీ టైమింగ్, విభిన్నమైన టోన్ తనను బాగా ఆకట్టుకున్నాయని, ఈ 'అనుమాన పక్షి' క్యారెక్టర్‌కు అతను హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అయ్యాడని తెలిపారు.

31 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్:

ఈ సినిమాను కేవలం 31 రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. కాశ్మీర్, వైజాగ్ లాంటి అవుట్ డోర్ లోకేషన్లలో ఎక్కడా బడ్జెట్ వేస్ట్ కాకుండా, పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ ముగించారు. ఇక కాశ్మీర్ షెడ్యూల్‌ను అయితే అనుకున్న దానికంటే ఒకరోజు ముందే పూర్తి చేసినట్లు దర్శకుడు సగర్వంగా చెప్పారు.

నెక్స్ట్ ఒక పెద్ద ప్రొడక్షన్ బ్యానర్‌లో:

డీజే టిల్లు హిట్ తర్వాత ఇండస్ట్రీలో చాలా గేట్స్ ఓపెన్ అయ్యాయని, పెద్ద పెద్ద నిర్మాతల నుంచి ఆఫర్స్ వచ్చాయని విమల్ చెప్పారు. టైమింగ్ కుదరకపోవడం వల్లే కొన్ని ప్రాజెక్ట్స్ ఆలస్యమయ్యాయని, ఈ 'అనుమాన పక్షి' రిలీజ్ కాగానే ఒక పెద్ద ప్రొడక్షన్ బ్యానర్‌లో తన తదుపరి సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుందని హింట్ ఇచ్చారు.

ఇక డీజే టిల్లులో సిద్దు క్యారెక్టర్ ఆడియన్స్‌ను ఎలా సర్ప్రైజ్ చేసిందో, 'అనుమాన పక్షి'లోని రాగ్ మయూర్ క్యారెక్టర్ కూడా అదే రేంజ్‌లో కడుపుబ్బా నవ్విస్తుందని విమల్ కృష్ణ గట్టి నమ్మకంతో ఉన్నారు. సెప్టెంబర్ 18న వస్తున్న ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పండగ తీసుకురావాలని ఆశిద్దాం..మరింత తెలుసుకోవాలి అంటే తుపాకీ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా ప్రసారమవుతున్న డైరెక్టర్ విమల్ కృష్ణ ఇంటర్వ్యూ చూసేయండి.



Full View


Tags:    

Similar News