బన్నీకి 'గాలి' స్పెషల్ ఇన్విటేషన్? భలే ట్విస్ట్ ఇది!
పదేళ్ల క్రితం జరిగిన ఓ మ్యారేజ్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లోనే ఇండియా మొత్తం సంచలనం సృష్టించిన ఆ మ్యారేజ్ డిజిటల్ ఇన్విటేషన్ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.
పదేళ్ల క్రితం జరిగిన ఓ మ్యారేజ్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లోనే ఇండియా మొత్తం సంచలనం సృష్టించిన ఆ మ్యారేజ్ డిజిటల్ ఇన్విటేషన్ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ముఖ్యంగా అందులో పదే పదే వినిపించే బన్నీ అనే వర్డ్ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో అసలు ఆ బన్నీ ఎవరనే చర్చ మొదలైంది.
2016లో బిజినెస్ మ్యాన్ గాలి జనార్దన్ రెడ్డి కూతురు బ్రాహ్మణి రెడ్డి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. ఆ పెళ్లి కోసం భారీ ఏర్పాట్లు చేయడంపై అప్పట్లో అందరి ఫోకస్ పడింది. అయితే పెళ్లి వేడుకలతో పాటు ఇన్విటేషన్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. సాధారణంగా పెళ్లి పత్రిక అంటే ఓ కార్డు.. కానీ ఇక్కడ మాత్రం బాక్స్ ఓపెన్ చేయగానే ఎల్ సీడీ స్క్రీన్ పై వీడియో ప్లే అయ్యేలా స్పెషల్ గా రెడీ చేశారు
ఆ వీడియోలో గాలి జనార్దన్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ గెస్టులను పెళ్లికి ఇన్వైట్ చేశారు. ఆ వీడియోలో వినిపించే కన్నడ పదాల్లో బన్నీ అనే వర్డ్ పదే పదే రావడం అప్పట్లో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. ఎందుకంటే తెలుగువారికి బన్నీ అంటే వెంటనే గుర్తొచ్చేది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే. హీరోగా ఆయనకు ఉన్న నిక్ నేమ్ బన్నీ. అదే పేరుతో వచ్చిన సినిమా కారణంగా ఆ నేమ్ అందరికీ కనెక్ట్ అయిపోయింది.
దీంతో ఆ మ్యారేజ్ ఇన్విటేషన్ వీడియోలో బన్నీ అనే వర్డ్ వినిపించడంతో.. అల్లు అర్జున్ కు ఏదైనా సంబంధం ఉందా? ఆయన కోసం స్పెషల్ గా ఆ వీడియో చేశారా? అంటూ అప్పట్లో కొందరు కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కన్నడలో బన్నీ అంటే అల్లు అర్జున్ కాదు.. రండి అని అర్థం. అంటే పెళ్లికి రండి అనే అర్థంలో ఆ పదాన్ని గాలి ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ చేశారు.
ఆ వీడియోలో కూడా కన్నడ లాంగ్వేజ్ లో పెళ్లికి రావాలని ఆహ్వానించే సందర్భంలోనే బన్నీ వర్డ్ వినిపించింది. అప్పట్లో ఆ విషయం తెలిసిన తర్వాత ఆ కన్ఫ్యూజన్ పై చాలామంది ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు. అల్లు అర్జున్ పేరు వల్ల తెలుగువారికి ఒక అర్థం కనిపిస్తే.. కన్నడలో మాత్రం అది చాలా నార్మల్ గా యూజ్ చేసే వెల్ కమ్ వర్డ్ కావడం విశేషం.
ఇప్పుడు అదే పదేళ్ల నాటి వీడియో మరోసారి నెట్టింట వైరల్ అవుతుండటంతో ఆ పాత ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మళ్లీ చర్చలోకి వచ్చింది. అప్పటి గ్రాండ్ మ్యారేజ్, వింతగా రూపొందించిన డిజిటల్ ఇన్విటేషన్ తో పాటు బన్నీ అనే వర్డ్ చుట్టూ జరిగిన కన్ఫ్యూజన్ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పదేళ్ల క్రితం చిన్న కన్ఫ్యూజన్ కు కారణమైన ఒక్క పదమే.. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ గా మారింది.